OTT Movie : కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఆలోచన శక్తిని కూడా ఇస్తాయి. అటువంటి సినిమాలు భారీ బడ్జెట్ తో కాకపోయినా, ఓ మాదిరిగానే థియేటర్లలోకి వస్తాయి. అయితే థియేటర్లలో ఆదరించకపోయినా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో వీటిని బాగానే ఆదరిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ అల్లరిగా తిరిగే ఒక అమ్మాయి జీవితంతో, ఒక పోకిరి ఎలా ఆడుకున్నాడో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందా వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (YouTube) లో
ఈ మూవీ పేరు ‘కజ్రీ’ (Kajri). కర్జ్రీ 18 ఏళ్ల అమ్మాయి అయినా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటుంది. ఆమె ఒక స్థానిక వ్యక్తి దృష్టిలో పడి, తనకు తెలీకుండానే అతని ఉచ్చులో పడిపోతుంది. ఆతరువాత ఆమె జీవితం శాశ్వతంగా మారిపోతుంది. ఆమె ఒక తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకోవలసి వస్తుంది. ఈ మూవీకి హైదర్ కజ్మీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కజ్రీ ఒక మారుమూల గ్రామంలో ఆడుతూ పాడుతూ, అల్లరిగా తిరుగుతూ ఉంటుంది. ఈమె పుట్టగానే ఆ గ్రామంలో వర్షాలు బాగా పడతాయి. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఈమెను ఫ్రీగా వదిలేస్తారు. అదే గ్రామానికి కిషన్ అనే వ్యక్తి మంచి చేయాలని వస్తాడు. అయితే అతనితో కూడా ఈమె అల్లరి చేష్టలు చేస్తుంది. ఆమె చిలిపి చేష్టలకు కిషన్ అనే వ్యక్తి పడిపోతాడు. మరోవైపు అదే ఊర్లో ఉండే ఒక పోరంబోగు కజ్రీని ఇష్టపడుతూ ఉంటాడు. తనకు పడకపోవడంతో, ఆమెను అందరూ చూస్తుండగా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆమెను ఏమీ చేయకుండా ఒక రోజు బంధిస్తాడు. తరువాత రోజు ఆమెను ఇంటికి పంపిస్తాడు. ఊరిలో అందరూ అక్కడ ఏదో జరిగి ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం మీద అక్కడ పంచాయతీ కూడా స్టార్ట్ అవుతుంది. పంచాయతీ పరిధిలో ఆ పోరంబోకును పెళ్లి చేసుకోమని కజ్రీ ని అడుగుతారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో, ఆ పోరంబోకు చేసిన పనికి శీల పరీక్ష చేయించాలి అనుకుంటారు.
అదే ఊరిలో ఉండే ఒక నకిలీ డాక్టర్ దగ్గరికి కజ్రీని పంపిస్తారు. వాడు నేను రిపోర్టు తప్పుగా ఇస్తే నిన్ను ఇక్కడ జనం బతకనివ్వరని, రిపోర్టు నీకు అనుకూలంగా రావాలంటే, నువ్వు నాకు అనుకూలంగా ఉండాలని చెప్తాడు. ఇంట్లోనే ఆమెకు మత్తు ఇచ్చి అఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత అందరికీ ఆమెకు ఏమీ జరగలేదని చెప్తాడు నకిలీ డాక్టర్. చెంగుచెంగు మని ఎగురుతున్న కజ్రీ, ఇలా జరగటంతో సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో అక్కడికి కిషన్ వస్తాడు. చివరికి ఈ ఘటనపై కిషన్ ఎలా స్పందిస్తాడు? ఆ ఊరి మనుషులకు కిషన్ బుద్ధి చెప్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కజ్రీ’ (Kajri) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.