BigTV English

Viswaksen Laila OTT : ‘లైలా ‘ మూవీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Viswaksen Laila OTT : ‘లైలా ‘ మూవీ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Viswaksen Laila OTT : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్సేన్ రీసెంట్ గా నటించిన మూవీ లైలా. భారీ అంచనాలతో ఫిబ్రవరి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజునే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లైలా సినిమాలో మొదటిసారిగా విశ్వక్ సేన్ లేడి గెటప్ వేశాడు. సినిమా విడుదలకు ముందు లైలాకు బాయ్ కాట్ సెగ అంటుకుంది. దాని నుంచి కోలుకుని నిన్న థియేటర్లలో విడుదలైన లైలాకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు.. ఇక కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే రావడంతో ఈ సినిమాని ఓటిటిలోకి త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. లైలా మూవీ ఓటిటి డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ..

గతేడాది బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలతో హిట్ అందుకున్న విశ్వక్సేన్ ఈ ఏడాది ఓపెనింగ్స్ లోనే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. వాసుదేవ మూర్తి అందించిన కథ, రామ్ నారాయణ్ దర్శకత్వం రొటీన్‌గా ఉన్నాయని, ఆకట్టుకునే సన్నివేశాలు ఏం లేవని తెలుగు ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారని టాక్. అయితే, విశ్వక్ సేన్ నటన మాత్రం చాలా బాగుందని, లేడి గెటప్పులో ఆకట్టుకున్నాడని అంటున్నారు. ఇక థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ మూవీని త్వరగా ఓటీటీలోకి తీసుకురావంతో మూవీ క్రేజ్ కొంతవరకు ఉంటుందని ఇక్కడ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లైలా యూనిట్ భావిస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


Also Read :బాలీవుడ్ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న సమంత.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

విశ్వక్ సేన్ గతంలో వచ్చిన మూడు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ ను అందుకున్నాయి. దీంతో ఈ ఏడాది అతని మార్కెట్ పూర్తిగా పెరిగింది. దాంతో లైలా మూవీకి భారీగా బడ్జెట్ ను పెట్టడానికి వెనుకాడలేదు. అందుకే అంచనాలు కూడా భారీగా క్రియేట్ అయ్యాయి. మొత్తానికి అదే జోష్ లో మూవీ థియేటర్లలోకి వచ్చింది. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక లైలా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు అమెజాన్ ప్రైమ్‌లో లైలా ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ టాక్ దృష్ట్యా నెల రోజుల కంటే ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే లైలా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. ఇక విశ్వక్ సేన్ మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తున్నాడు. కనీసం అవన్నా హిట్ అయితే మళ్లీ హిట్ ట్రాక్ కంటిన్యూ అవుతుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు…

లైలా కలెక్షన్స్..

ఈ మూవీ బిజినెస్ మాత్రం ఓ రేంజులో జరిగింది. 8 కోట్ల వరకు ఓవరాల్ గా బిజినెస్ జరిగింది. 10 కోట్ల టార్గెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు కోటి లోపు కలెక్షన్స్ ను అందుకుంది. అదే విధంగా రెండో రోజు కూడా కలెక్షన్స్ ను అందుకుంది. మొత్తానికి రెండు కోట్ల లోపే వసూల్ చేసింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×