OTT Movie : ప్రేమించడం కన్నా, ప్రేమించబడడం అదృష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ కొంత మంది దగ్గరే దొరుకుతుంది. మొట్టమొదటిసారిగా ప్రేమ దొరికేది తల్లిదండ్రుల వద్దనే. ఆ తర్వాతే మరెవరైనా కూడా. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో ప్రేమ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ (Zee5) లో
ఈ తమిళ్ లవ్ స్టోరీ మూవీ పేరు ‘కమలి ఫ్రమ్ నడుక్కావేరి’ (Kamali from Ndukkaveri). ఈ మూవీకి రాజశేఖర్ దొరై దర్శకత్వం వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే కమలి, IIT లో టాపరైన అశ్విన్ ని టివిలో చూసి ప్రేమించడం మొదలుపెడుతుంది. మద్రాస్ IIT లో అశ్విన్ ను కలవాలంటే బాగా చదవాలనుకుంటుంది. కమలి పట్టుదలతో చదివి మద్రాసు ఐఐటిలో ప్రవేశం పొందుతుంది. ఆమెకు శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ నంబి ప్రోత్సాహం, స్ఫూర్తితో మద్రాసు IIT లో చదువులో రాణించడమేగాక, ఢిల్లీలో జరిగిన క్విజ్ లో పాల్గొని విజయం సాధిస్తుంది. అక్కడ తను ప్రేమిస్తున్న సీనియర్ అశ్విన్ దృష్టిలో పడడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. సినిమా మద్రాసు ఐఐటీలోనే చాలావరకు తీశారు. ఈ మూవీలో కమలినిగా అన్నధి, అశ్విన్ గా రోహిత్ సరీఫ్ నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కమలి ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటూ, చదువులో మాత్రం వెనకబడి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను చదవమని పెద్దగా ఒత్తిడి చేయరు. ఎందుకంటే పెళ్లి చేసి పంపించాలని చూస్తుంటారు. అయితే కమలి అన్నయ్య మీద తండ్రి ఎక్కువగా ఆశలు పెట్టుకుంటాడు. అతన్ని బాగా చదివించాలి అనుకుంటాడు. ఈలోగా ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. అందులో కమలి అన్నయ్య ఫైల్ అవ్వడంతో, తండ్రి అతన్ని బాగా తిడతాడు. ఆ తర్వాత ఐఐటీలో ఒక టాప్ ర్యాంకర్ ను టీవీలో చూపిస్తుంటారు. అందులో టాపర్ ర్యాంకర్ అశ్విన్ ను చూసి కమలి ప్రేమలో పడుతుంది. అతన్ని కలవాలంటే ఐఐటీలో పాస్ అయితే కలవచ్చు అనుకుంటుంది. ఈ క్రమంలోనే ఐఐటి కి ప్రిపేర్ అవుతుంది కమలి. అనుకున్నట్టుగానే మంచి ర్యాంకు సాధిస్తుంది.
అశ్విన్ చదివే మద్రాస్ ఐఐటీ కాలేజీలోనే సీటు కూడా దొరుకుతుంది. అక్కడికి వెళ్లి కూడా ఎక్కువగా చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఆ తర్వాత ఢిల్లీలో ఒక కాంపిటీషన్ నిర్వహిస్తారు. అందులో మద్రాస్ ఐఐటీ నుంచి ఇద్దరు వ్యక్తులు సెలెక్ట్ అవుతారు. వారిలో కమలి, అశ్విన్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్తారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ పరిచయం బాగా అవుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారా? క్విజ్ పోటీలు ఎలా జరుగుతాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కమలి ఫ్రమ్ నడుక్కావేరి’ (Kamali from Ndukkaveri) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.