Amla Powder For White Hair: చిన్న వయస్సులోనే ప్రస్తుతం చాలా మంది వైయిట్ హెయిర్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడటానికి హెయిర్ డై లు, ఫాంపూలు, ఆయిల్స్ వాడే వారు ఎక్కువగానే ఉంటారు. కానీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం హెయిర్ డైలను ఎక్కువగా వాడుతుంటారు. కానీ వీటిని వాడటం చాలా హానికరం. ఇవి తాత్కాలికంగా జుట్టు రంగును నల్లగా మార్చినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. అందుకే ఇలాంటి రసాయన ఉత్పత్తులను వాడకుండా హోం రెమెడీస్ వాడటం అలవాటు చేసుకోవడం మంచిది.
ముఖ్యంగా ఉసిరి పొడితో తయారు చేసిన హోం రెమెడీస్ తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా జుట్టు రాకుండా, ఒత్తుగా మార్చేందుకు కూడా ఉపయోగపడతాయి. మరి తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఎలాంటి హోం రెమెడీస్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి పొడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి జుట్టుకు ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టును పొడవుగా , మందంగా చేసుకోవచ్చు. అంతే కాకుండా తెల్ల జుట్టును కూడా నల్లగా మార్చుకోవచ్చు. ఉసిరి మీ జుట్టు బలహీనతను తొలగించి, దానిని పొడవుగా చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఉసిరి పౌడర్, పెరుగు :
ముందుగా 2 టీస్పూన్ ఉసిరి పౌడర్ తీసుకొని అందులో తగినంత పెరుగు కలపాలి. ఇప్పుడు దానిని మీ జుట్టుకు అప్లై చేసి దాదాపు 30 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత జుట్టును వాష్ చేయండి. ఇది తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఉపయోగపడుతుంది.
నల్లటి, మందపాటి జుట్టు కోసం ఉసిరి పొడి , పెరుగు వాడటం చాలా ప్రయోజనకరం. దీనివల్ల జుట్టు ఇన్ఫెక్షన్ సమస్య కూడా తగ్గుతుంది. తరచుగా దీనిని వాడటం వల్ల తెల్ల జుట్టును కూడా నల్లగా మారుతుంది.
జుట్టుకు ఉసిరి హెయిర్ టానిక్ :
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఉసిరి టానిక్ చాలా ప్రభావ వంతంగా పని చేస్తుంది.ఈ హెయిర్ టానిక్ తయారు చేయడానికి ముందుగా 2 నుండి 3 ఉసిరికాయలను తీసుకుని, 1 గ్లాసు నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ నీటిని ఒక సీసాలో నింపి, అందులో 1 నుండి 2 విటమిన్ ఇ నూనె వేసి కలపాలి. దీనిని జుట్టుకు స్ప్రె చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
Also Read: ఈ ఒక్కటి వాడితే చాలు.. ముఖంపై మంగు మచ్చలు మాయం
ఉసిరి, నిమ్మరసం:
జుట్టు అందం, పెరుగుదలను మెరుగుపరచడంలో ఉసిరి పొడి ,నిమ్మరసం చాలా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. దీని కోసం నిమ్మరసంలో కొద్దిగా ఉసిరి పొడి కలపండి. ఇప్పుడు అందులో కొంచెం నూనె కలిపి మీ జుట్టుకు రాయండి. ఇది మీ జుట్టు పెరుగుదలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది. తరచుగా ఉసిరి పొడిని మీ జుట్టుకు వాడటం వల్ల తెల్ల జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు.