BigTV English

OTT Movie : పెళ్లి కూతురి తల్లితో ప్రేమలో పడే పెళ్లి కొడుకు తండ్రి… ఈ లవ్ స్టోరీని చూసి నవ్వు ఆపుకోవడం కష్టమే

OTT Movie : పెళ్లి కూతురి తల్లితో ప్రేమలో పడే పెళ్లి కొడుకు తండ్రి… ఈ లవ్ స్టోరీని చూసి నవ్వు ఆపుకోవడం కష్టమే

OTT Movie : బాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హిందీ సినిమాలను ప్రత్యేకంగా అభిమానించే వారు ఈ మూవీని చూడాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ‘ఇష్క్ కీ ఛావ్ తలే’, ‘జబ్ భీ నాచే’ వంటి పాటలు మంచి ఊపు తెస్తాయి. కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమాను చూసి నవ్వు ఆపుకోవడం కష్టమే.  ప్రేక్షకులు ఫ్యామిలీతో సహ ఈ సినిమాను ఇష్టంగా చూస్తారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


జీ 5 (ZEE5)లో

ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘లవ్ కి అరేంజ్ మ్యారేజ్’ (Luv Ki Arrange Marriage). 2024 లో వచ్చిన ఈ మూవీకి ఇష్రత్ ఆర్. ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో సన్నీ సింగ్, అవ్నీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషించగా… అన్నూ కపూర్, సుప్రియా పాఠక్, రాజ్‌పాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ లవ్ (సన్నీ సింగ్), ఇషికా (అవనీత్ కౌర్) ల చుట్టూ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా 2024 జూన్ 14 నుంచి జీ5 (ZEE5)లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

లవ్ (సన్నీ సింగ్), ఇషికా (అవనీత్ కౌర్) తో ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మొదట్లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి గొడవలు పడతారు. అయితే ప్రేమించుకుంటున్న విషయం ఇంట్లో చెప్పకుండా, అరేంజ్డ్ మ్యారేజ్ సెటప్‌తో సంబంధం కుదుర్చుకోవాలని అనుకుంటారు. స్టోరీ ఇప్పుడే అనుకోని మలుపు తీసుకుంటుంది. లవ్ తండ్రి ప్రేమ్ కుమార్ భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు ఇషికా తల్లి సుప్రియాతో అతను ప్రేమలో పడతాడు. ఈ ఊహించని ప్రేమ కోణం కారణంగా కుటుంబాల మధ్య గందరగోళం ఏర్పడుతుంది. యువ జంట తమ ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండగా, వారి తల్లిదండ్రుల ప్రేమ కథ కూడా సమాంతరంగా నడుస్తుంది.

లవ్, ఇషికా తమ ప్రేమ కోసం పోరాడాలా లేక తల్లిదండ్రుల సంతోషం కోసం తమ ప్రేమను త్యాగం చేయాలా ? అనే ఎమోషనల్ డైలమాలో పడతారు. ఈ సందర్భంలో రాజ్‌పాల్ ఎంట్రీ మరింత గందరగోళాన్ని పెంచుతుంది. ఈ రెండు జంటల ప్రేమ కథ కామెడీ సన్నివేశాలతో నడుస్తూ ఉంటుంది. చివరికి ఎవరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది ? పిల్లల కోసం పెద్దలు వదులుకుంటారా ? పెద్దల కోసం పిల్లలు వదులుకుంటారా ? అనే విషయాలను ఈ రొమాంటిక్ కామెడీ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. మైండ్ రిలీఫ్ కోసం ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు.

Read Also : ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ … ప్రియుడు ఉండాగానే మరొకరితో రొమాన్స్ … ఏం బో*ల్డ్ సీన్స్ రా సామి

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×