BigTV English

OTT Movie : అమ్మాయిలను బ్రూటల్ గా చంపే సైకోగాడు … వీడు చంపే తీరుకు వణుకు పుట్టాల్సిందే

OTT Movie : అమ్మాయిలను బ్రూటల్ గా చంపే సైకోగాడు … వీడు చంపే తీరుకు వణుకు పుట్టాల్సిందే

OTT Movie : కొంతమంది సైకోలు చేసే హత్యలు చాలా ఘోరంగా ఉంటాయి. నరకంలో కూడా ఇలా బాధపెట్టరేమో అన్నట్టుగా ఉంటాయి ఈ హత్యలు. అటువంటి హత్యలతో సైకో సినిమాలు చాలానే వస్తున్నాయి. క్రూరత్వాన్ని రకరకాలుగా చూపిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక సైకో అమ్మాయిలను క్రూరాతి క్రూరంగా చంపుతాడు. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు వణుకు పుట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ స్లాషర్ హారర్ మూవీ పేరు ‘టెర్రిఫైర్’ (Terrifier). 2016లో విడుదలైన ఈ మూవీకి డామియన్ లియోన్ దర్శకత్వం వహించారు. ఇందులో జెన్నా కానెల్, సమంతా స్కాఫిడి, డేవిడ్ హోవార్డ్ థోర్న్టన్, కేథరిన్ కొర్కొరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం హాలోవీన్ రాత్రి, ఆర్ట్ ది క్లౌన్ అనే ఒక క్రూరమైన సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మోనికా బ్రౌన్ అనే మహిళఒక టీవీ టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా, మునుపటి హాలోవీన్ రాత్రి జరిగిన ఒక ఊచకోత నుండి బయటపడిన, ముఖంపై గాయాలతో ఉన్న ఒక మహిళను మోనికా ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ మహిళ ఆర్ట్ ది క్లౌన్ అనే కిల్లర్‌ను చూసినట్లు చెబుతుంది. అయితే అతని మృతదేహం మార్చురీ నుండి అదృశ్యమైనట్లు మోనికా పేర్కొంటుంది. అతను ఇంకా బతికే ఉండవచ్చని అక్కడ ఉన్నవాళ్ళు అనుమాణిస్తారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత, మోనికా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో ఆ మహిళ రూపాన్ని గేలిచేస్తూ మాట్లాడుతుంది. కానీ అదే సమయంలో ఆ మహిళ మోనికాపై క్రూరంగా దాడి చేస్తుంది.ఇప్పుడు స్టోరీ ఒక సంవత్సరం వెనక్కి వెళ్తుంది. 2017 హాలోవీన్ రాత్రికి తాగిన స్థితిలో పార్టీ నుండి ఇద్దరు స్నేహితులు తారా , డాన్ బయటకు వస్తారు. వీళ్ళు తినడానికి ఒక కేఫ్ కు వెళతారు.

అక్కడ వారు ఆర్ట్ ది క్లౌన్ ను కలుస్తారు. అతను వింతగా ప్రవర్తిస్తూ క్లౌన్ దుస్తుల్లో ఉంటాడు. అక్కడ జరిగిన చిన్నపాటి గోడవలో, బాత్రూం ధ్వంసం అవుతుంది. ఆర్ట్ అలా చేసినందుకు రెస్టారెంట్ యజమాని అతన్ని బయటకు గెంటేస్తాడు. తారా , డాన్ బయటకు వెళ్లినప్పుడు కారు టైర్లు పంక్చర్ అయినట్లు డాన్ గుర్తిస్తాడు. తారా తన సోదరి విక్టోరియాని కారు తీసుకురమ్మని కాల్ చేస్తుంది. ఆర్ట్ తన బ్యాగ్‌లో బ్లేడెడ్ ఆయుధాలతో, తారా, డాన్ ను క్రూరంగా హత్య చేస్తాడు. అతని హత్యలు విపరీతమైన హింసాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలపై అతని దాడులు విపరీతమైన క్రూరత్వాన్ని చూపిస్తాయి. ఆతరువాత ఆర్ట్ విక్టోరియాపై కూడా దాడి చేసి, ఆమె ముఖాన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. చివరికి విక్టోరియా మోనికా పై దాడి ఎందుకు చేస్తుంది ? ఆర్ట్ ను పోలీసులు పట్టుకుంటారా ? అతను ఇంకా ఎన్ని హత్యలు చేస్తాడు. ఈ విషయాలను తెలుసుకోవాలంటే, ఈ మూవీని చూడాల్సిందే.

Read Also : ఫ్యామిలీ ని వెంటాడే శాపం … వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

Related News

OTT Movie : శబ్దం చేస్తే బతికుండగానే నమిలి మింగేసే డెత్ ఏంజెల్స్… కల్లోనూ వెంటాడే 1 గంట 30 నిమిషాల థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్లోనే దుకాణం ఓపెన్.. ఇటు గర్ల్ ఫ్రెండ్, అటు టీచర్ తో… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : వెంటాడే చెట్టు శాపం… ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసే పువ్వులు… వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ మూవీ

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

Big Stories

×