సజ్జల ఈజ్ బ్యాక్.. అవును కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సజ్జల ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. ఆయన కమ్ బ్యాక్ కోసం వైసీపీ ఏకంగా ఓ సభ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సభ బీసీలది. మరి బీసీ సభలో ఓసీ నాయకుడు సజ్జల ఎందుకు అనే అనుమానం అందరికీ రావడం కామన్. సభ బీసీలది అయినా వైసీపీలో బీసీల తరపున మాట్లాడే నాయకులెవరూ లేరని కాబోలు సజ్జలని తెరపైకి తెచ్చారు. ఆయనతోనే ఉపన్యాసం ఇప్పించారు. వైసీపీ బీసీల పార్టీ అని చెబుతూ.. బీసీలకు పెద్దగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సజ్జలే లీడ్ తీసుకోవడం ఇక్కడ విశేషం. దీంతో టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. వైసీపీలో బీసీ నేతల పరిస్థితి ఏంటో ఈ సభతోనే అర్థమైపోయిందని అంటున్నారు టీడీపీ నేతలు.
సజ్జల సడన్ ఎంట్రీ..
ఇటీవల కొంతకాలంగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కనపడ్డంలేదు. సహజంగా జగన్ ఎక్కడుంటే ఆయన కూడా అక్కడ ఉండాలి. కానీ ఆయన లేకుండానే జగన్ నాలుగైదు సార్లు జనంలోకి వచ్చారు. పార్టీ ఆఫీస్ లో కూడా మీటింగ్ లు జరిగాయి. సజ్జల లేకపోవడంతో చాలామందికి చాలా అనుమానాలొచ్చాయి కానీ, ఆయన ఇప్పుడు సడన్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ నాయకత్వం కూడా సజ్జలకే జగన్ అప్పగించడం మరో విశేషం. దీంతో జగన్ వద్ద ఆయన ప్రయారిటీ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది.
-సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన పార్టీ వైయస్ఆర్సీపీ
: సజ్జల రామకృష్ణారెడ్డి గారు, స్టేట్ కోఆర్డినేటర్
స్వాంతత్రం వచ్చిన తరువాత సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీ. సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు… pic.twitter.com/e2Jztd6Nxd
— YSR Congress Party (@YSRCParty) April 19, 2025
సజ్జలపై గరం గరం..
అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రి అనే అపవాదు మోశారు సజ్జల. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామందికి ఆయన టార్గెట్ అయ్యారు. కొందరు బయటపడి మాట్లాడేశారు, మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. ఇంకొందరు ఏకంగా పార్టీ నుంచి బయటకొచ్చేసి కోటరీ అంటూ కేకలు వేశారు, కానీ ఫలితం లేదు. జగన్ మాత్రం సజ్జలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో ఆయనకు పెద్దపీట వేశారు. ఇక తాజాగా బీసీ మీటింగ్ కూడా సజ్జల నేతృత్వంలోనే జరిగింది.
వైసీపీ బీసీ సెల్ మీటింగ్ కి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ సహా అన్ని జిల్లాలనుంచి బీసీ నేతలు హాజరయ్యారు. అయితే కీలక ఉపన్యాయం మాత్రం సజ్జలదే. బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అనే విషయాన్ని జగన్ నిరూపించారని అన్నారు సజ్జల. వైసీపీ నేతలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని సూచించారు. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలను ఈసారి నియమించుకుందామని అన్నారాయన. విశాఖలో బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి తప్పించారని విమర్శించారు.
అంతా బాగానే ఉంది కానీ సజ్జల రీఎంట్రీ కోసం బీసీ మీటింగ్ ని ఎంచుకోవడం హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ నేతలు. బీసీ పార్టీ అంటే టీడీపీయేనని, బీసీలకు అవకాశాలిచ్చి, నేతలుగా ఎదిగే తోడ్పాటునిచ్చింది, ఇస్తోంది కూడా టీడీపీయేనని చెప్పారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని వారు కౌంటర్లిచ్చారు.