OTT Movie : థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఒక బెంగాలీ సినిమా ట్విస్టులతో మతి పోగొడుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కి ఆడియన్స్ అదిరిపోయారు. ఒక హిల్ టౌన్‌లో, ఒక డాక్టర్ భార్య అదృశ్యమైన కేసు చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని పక్కాగా ఇస్తుంది. ఈ సినిమా 9 అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ బెంగాలీ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
మంచుతో కప్పబడిన ఒక హిల్ టౌన్‌లో కథ మొదలవుతుంది. పొగమంచు, చల్లని గాలి, సన్నని రోడ్లు, చుట్టూ హిమాలయన్ కొండలు. ఇక్కడ సయాన్ బోస్ ఒక యంగ్, డెడికేటెడ్ పోలీసు ఇన్‌స్పెక్టర్. రెగ్యులర్ గా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటాడు. సయాన్ ఒక ఒంటరి వ్యక్తి, కానీ నీట్‌గా డ్యూటీ చేసే టైప్. ఒక రోజు రాత్రి అతను టౌన్‌లోని ఒక పెద్ద ఇంటి నుండి ఒక మహిళ అరుపులు వింటాడు. ఆ ఇల్లు డాక్టర్ ప్రశాంత్ ది. అతను టౌన్‌లో ఒక రిచ్, కానీ కొంచెం సీక్రెటివ్ వ్యక్తి. సయాన్ డ్యూటీ మీద ఉన్న సీరియస్‌నెస్‌తో ఆ ఇంటికి వెళ్తాడు. “ఏమైంది? ఎవరు అరిచారు?” అని అడుగుతాడు. డాక్టర్ ప్రశాంత్ కూల్‌గా అది నా భార్య జోనాకీ, ఆమెకు ఇంజెక్షన్ ఇస్తుంటే అరిచిందని చెబుతాడు. కానీ సయాన్‌కి ఏదో తేడాగా అనిపిస్తుంది. డాక్టర్ ఇంట్లోకి ఎవరినీ రానివ్వడు, మరీ ఫాస్ట్‌గా డోర్ మూసేస్తాడు. సయాన్ బయటకు వచ్చాక, పొరుగువాళ్లతో మాట్లాడతాడు. వాళ్లు ఒక షాకింగ్ విషయం చెప్తారు. మేం ఆ ఇంట్లో అరుపులు తరచూ వింటాం, కానీ డాక్టర్ భార్య జోనాకీని ఎప్పుడూ చూడలేదు! ఆమె ఎవరో కూడా తెలీదు!” అనే సమాధానం వస్తుంది.
సయాన్‌కి ఇది అనుమానాస్పదంగా అనిపిస్తుంది. జోనాకీ అనే ఆమె ఉనికే ఒక పజిల్‌లా మారుతుంది. ఆమె ఫోటో ఎవరూ చూడలేదు, ఆమె గురించి ఎటువంటి ఆధారాలు లేవు. తర్వాతి రోజు డాక్టర్ ప్రశాంత్ స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి, “నా భార్య జోనాకీ మిస్సింగ్!” అని కంప్లైంట్ ఇస్తాడు. కానీ అతను చూపించే ఫోటో ఒక్కటే. అది కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది. సయాన్ ఈ కేసును తీసుకుంటాడు. ఇక్కడ నుండి కథ ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌లా మారుతుంది. సయాన్ డాక్టర్ జీవితంలోని సీక్రెట్స్ ను లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ టౌన్‌లో జరిగే కొన్ని అసాధారణ సంఘటనలు, డాక్టర్ మిస్టీరియస్ బిహేవియర్, జోనాకీ గురించిన అనుమానాలు సయాన్‌ను ఒక కొత్త ప్రయాణంలోకి లాగుతాయి. కథలో కీలక ట్విస్ట్ లు వస్తాయి. ఈ సన్నివేశాలు ఊహించని షాక్‌లతో ఉంటాయి. ఇంతకీ ఆ మహిళ ఎలా మిస్ అయింది ? ఆ ఇంట్లో అరుపులు ఎందుకు వచ్చేవి ? సయాన్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ట్విస్టులు బయటికి వస్తాయి? ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.
“ఖోజ్” (Khoj) అర్కా గంగూలీ దర్శకత్వంలో వచ్చిన బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇది టెలివిజన్ మూవీగా మొదలై, ఫెస్టివల్ సక్సెస్ తర్వాత థియేట్రికల్‌గా విడుదలైంది. ఇందులో విక్రమ్ చటర్జీ, షతాఫ్ ఫిగర్, పూనమ్ గురుంగ్, అర్నబ్ భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది బెంగాలీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 6.7/10 రేటింగ్ పొందింది.
Read Also : గ్రామంలో ఏ మహిళనూ వదలని దొర… పనోడితో దొర పెళ్ళాం… ఈ అరాచకం మాములుగా ఉండదు భయ్యా