E-Paper
Advertisement

94 శాతం ఫ్రెష్ రేటింగ్‌ ఉన్న హాలీవుడ్ ఇంటెన్స్ థ్రిల్లర్… తెలుగులోనే ఇప్పుడు రెండు ఓటీటీల్లో

94 శాతం ఫ్రెష్ రేటింగ్‌ ఉన్న హాలీవుడ్ ఇంటెన్స్ థ్రిల్లర్… తెలుగులోనే ఇప్పుడు రెండు ఓటీటీల్లో
Advertisement

Romantic Crime Thriller: కొన్ని సినిమాలు బాక్సాఫీస్ కంటే విమర్శకుల ప్రశంసలతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘లవ్ లైస్ బ్లీడింగ్’ (Love Lies Bleeding) ఒకటి. 2024లో విడుదలైన ఈ హాలీవుడ్ నియో-నాయిర్ క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్, ప్రముఖ మూవీ రివ్యూ వెబ్‌సైట్ రాటేన్ టమాటోస్ లో 94 శాతం క్రిటిక్స్ ఫ్రెష్ రేటింగ్ సాధించి సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల కోసం రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1980ల అమెరికా నేపథ్యంలో సాగుతుంది. చిన్న పట్టణంలో జిమ్ మేనేజర్‌గా పని చేస్తున్న లూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. అయితే ఆమె కుటుంబానికి ప్రమాదకరమైన నేర ప్రపంచంతో సంబంధాలు ఉండటంతో, గతం నుంచి పూర్తిగా బయట పడలేకపోతుంది. అదే సమయంలో బాడీబిల్డింగ్‌లో విజయం సాధించి లాస్ వేగాస్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక పోటీల్లో గెలవాలనే లక్ష్యంతో జాకీ అనే యువతి ఆ పట్టణానికి వస్తుంది.

Advertisement

మొదటి పరిచయమే ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీస్తుంది. జాకీ కలలను నిజం చేయాలని లూ నిర్ణయించుకుంటుంది. కానీ వారి జీవితాలు అనుకున్నంత సులభంగా సాగవు. లూ కుటుంబానికి సంబంధించిన నేర ప్రపంచం మెల్లగా వీరిద్దరినీ తన వలలోకి లాగుతుంది. ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైన సమస్య, క్రమంగా ప్రాణాంతకమైన పరిస్థితులకు దారి తీస్తుంది.

తమను తాము కాపాడుకోవడానికి ఇద్దరూ తీసుకున్న నిర్ణయాలు మరిన్ని ప్రమాదాలను తీసుకొస్తాయి. ప్రతి అడుగులో కొత్త శత్రువులు, అనుకోని మలుపులు, హింసాత్మక సంఘటనలు కథను ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకెళ్తాయి. ప్రేమ కోసం వాళ్ళు ఎంత దూరం వెళ్లారు ? నేర ప్రపంచం నుంచి నిజంగా బయట పడగలిగారా ? చివరికి వారి ప్రేమ గెలిచిందా ? లేక పరిస్థితులే వారిని ఓడించాయా ? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా క్లైమాక్స్.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకురాలు రోజ్ గ్లాస్ కథను చెప్పిన విధానం. సాధారణ ప్రేమకథలా మొదలై, క్రమంగా డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా మారే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్రిస్టెన్ స్టెవర్ట్, కాటీ ఓ’బ్రియన్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించగా, విలన్ పాత్రలో ఎడ్ హారిస్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటాడు. బాడీబిల్డింగ్ నేపథ్యం, డార్క్ హ్యూమర్, స్టైలిష్ విజువల్స్, 1980ల కాలాన్ని ప్రతిబింబించే మేకింగ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి.

ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, JioHotstar ఓటీటీలలో తెలుగు డబ్బింగ్‌తో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణ రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా, ప్రేమతో పాటు క్రైమ్, సస్పెన్స్, డార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిసిన కథలను చూడాలంటే దీన్ని తప్పకుండా చూడాల్సిందే. ప్రతి మలుపులో ఉత్కంఠను పెంచుతూ, చివరి వరకు ప్రేక్షకుడిని కథలో మునిగిపోయేలా చేసే ఈ సినిమాను మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోండి.

Read Also: కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

Tags

Related News

గతంలో జరిగిన నేరం… వర్తమానంలో వెంటాడిన శాపం… మస్ట్ వాచ్ హారర్

నిషేధిత మాయా విద్యతో ప్రేమ, ప్రతీకారం… ఫాంటసీ లవర్స్ అస్సలు మిస్ కాకూడని కొరియన్ సిరీస్

ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఓటీటీలో… 30 ఏళ్లు పోలీసులకు దొరకని మాస్టర్‌మైండ్ కథ

బెడ్‌రూమ్‌లో తీవ్రంగా వేధించే భర్త… కట్ చేస్తే శవంతో చిక్కుల్లో పడే భార్య

మంచులో ఒంటరి సైనికుడి సర్వైవల్ ఫైట్.. యుద్ధం కంటే ప్రాణాల కోసం జరిగే ఈ పోరాటమే భయంకరం

బెడ్‌రూమ్‌లో కూర్చునే 200 కోట్ల చోరీ.. ఒక్క హ్యాక్‌తో ప్రాణాల మీదికి… హై-వోల్టేజ్ సైబర్ థ్రిల్లర్

గ్లామర్ ప్రపంచం వెనుక దాగిన నిజాలు… ఏంజెలీనా జోలీ కొత్త మూవీ

బంగారం కోసం వచ్చిన దొంగలకు చుక్కలు చూపించే శివంగి… మంచులో సాగే సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×