Trending Shows : ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకుల జీవితాల్లో భాగమైపోయాయి. థియేటర్లకు వెళ్లకుండానే మొబైల్ లేదా స్మార్ట్ టీవీలో ఇంట్లో కూర్చొని సినిమాలు, సిరీస్‌లు, క్రికెట్, రియాలిటీ షోలు అన్నీ ఆస్వాదించడం సాధారణమైపోయింది. ఓర్మాక్స్ మీడియా తాజా డేటా ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం అత్యధికంగా వీక్షించబడుతున్న టాప్ 10 ఓటీటీ షోలు ఏంటో తెలుసుకుందాం పదండి. సస్పెన్స్ నుంచి క్రికెట్ వరకు అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆ లిస్ట్ ఏంటంటే…
ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడుతున్న కంటెంట్ ఇదే. 12 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ స్థానంలో ఉంది. క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ ను ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.
ఎక్కడ చూడాలి: JioHotstar
రణవీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 7.5 మిలియన్ల వ్యూస్ తో రెండవ స్థానంలో ఉంది. ఇందులో ఉన్న రివేంజ్, సస్పెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇది ‘ధురందర్ 2’కి కూడా గట్టి పోటీ ఇస్తోంది.
ఎక్కడ చూడాలి: JioHotstar
జిమ్ సర్భ్, నసీరుద్దీన్ షా నటించిన ఈ వెబ్ సిరీస్ 5.7 మిలియన్ల వీక్షణలతో మూడవ స్థానంలో ఉంది. ఇండియన్ బిజినెస్ ఇతిహాసం, సంఘర్షణలు, విజయాలను ఆకర్షణీయంగా చూపించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఎక్కడ చూడాలి: MX Player
మహిళా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ టోర్నమెంట్ 5.3 మిలియన్ల వీక్షణలతో నాలుగవ స్థానంలో ఉంది. భారత మహిళల జట్టు ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
ఎక్కడ చూడాలి: JioHotstar
18 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఐకానిక్ టీవీ షో OTTలో కూడా తన ముద్ర వేసింది. 4.8 మిలియన్ల వీక్షణలతో ఐదవ స్థానంలో ఉంది. కుటుంబంతో కలిసి చూడడానికి ఇంకా బెస్ట్ ఆప్షన్.
ఎక్కడ చూడాలి: YouTube – SonyLIV
ప్రపంచ కప్ ఉత్సాహం ఓటీటీలో కూడా కొనసాగుతోంది. 4.4 మిలియన్ల వీక్షణలతో ఆరవ స్థానంలో ఉంది.
ఎక్కడ చూడాలి: ZEE5
వంటలు ప్లస్ కామెడీ కలయికగా వస్తున్న ఈ రియాలిటీ షో 3.9 మిలియన్ల వీక్షణలతో ఏడవ స్థానంలో ఉంది. హాస్యం, వంటలు, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఒక్కటిగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఎంతో ఆనందిస్తున్నారు.
ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్
ఏక్తా కపూర్ ప్రముఖ సీరియల్ “నాగిన్ 7” 3.8 మిలియన్ల వీక్షణలతో ఎనిమిదవ స్థానంలో ఉంది. చివరి ఎపిసోడ్ జూన్ 14న ప్రసారమైంది.
ఎక్కడ చూడాలి: జియో హాట్ స్టార్
మలయాళ టీవీ షో 3.3 మిలియన్ల వీక్షణలతో తొమ్మిదవ స్థానంలో ఉంది. దంగల్ టీవీ యూట్యూబ్ ఛానల్‌లో చూడవచ్చు.
మలయాళ సినిమా 3.2 మిలియన్ల వీక్షణలతో పదవ స్థానంలో ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. ఈ మూవీ జియో హాట్ స్టార్ లో ఉంది.
Read Also : శరీరాలపై బైబిల్ వాక్యాలు చెక్కి చంపే సైకో… గ్రిప్పింగ్ సైకో థ్రిల్లర్