Horror Thriller: హారర్ సినిమాలు అంటే కేవలం దెయ్యాలు, జంప్ స్కేర్స్ మాత్రమే కాదు. కథ, భయం, సర్వైవల్, రక్తం గడ్డకట్టించే విజువల్స్ అన్నీ కలిస్తేనే అసలు థ్రిల్ వస్తుంది. అలాంటి అనుభూతినే అందించిన చిత్రం ‘Evil Dead Burn’. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, మరోసారి ‘Evil Dead’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్‌ను నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా నేటి నుంచే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రావడంతో హారర్ అభిమానులలో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. గ్రాఫిక్ హారర్, ఉత్కంఠభరితమైన సర్వైవల్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో సాగుతుంది. వయొలెన్స్ , ఉత్కంఠను పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చివరి వరకు ఊపిరి బిగపట్టే స్క్రీన్‌ప్లే ఈ సినిమాను హారర్ లవర్స్‌కు ప్రత్యేక అనుభూతిగా మార్చాయి. మరి ఓటీటీలో ఈ సినిమాను హర్రర్ మూవీ లవర్స్ ఎక్కడ చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.
తన భర్త అకాల మరణంతో తీవ్ర మానసిక వేదనలో ఉంటుంది ఆలిస్ అనే మహిళ. కొంత ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఉన్న తన అత్తమామల ఇంటికి వెళ్తుంది. ఆ ఇంటి చుట్టూ ఎవరూ లేకపోవడం, వింత నిశ్శబ్దం, పాతకాలపు వాతావరణం ఉంటుంది. అక్కడ మొదటి నుంచే ఏదో ప్రమాదం దాగి ఉందనే భావన కలిగిస్తుంది. మొదట అన్నీ సాధారణంగానే కనిపించినా, ఇంట్లో దాచిపెట్టిన ఒక పురాతన గ్రంథం ఆమె కంటపడుతుంది.
ఆ పుస్తకమే ‘బుక్ ఆఫ్ ది డెడ్’. దాని గురించి తెలియక, అందులో ఉన్న కొన్ని మంత్రాలు చదవడంతో నిద్రలో ఉన్న దుష్ట శక్తులు ఒక్కసారిగా మేల్కొంటాయి. ఆ తర్వాత ఇంట్లో జరిగే ప్రతి సంఘటన భయంకరంగా మారిపోతుంది. ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు ఆ దుష్టశక్తుల బారిన పడుతూ భయంకరమైన డెడైట్స్‌గా మారడం ప్రారంభిస్తారు. ఎవరిని నమ్మాలో, ఎవరితో ఫైట్ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంటి నుంచి బయటపడాలని ప్రయత్నించిన ప్రతిసారి కొత్త అడ్డంకులు ఎదురవుతాయి. భయం, రక్తపాతం, ప్రాణాల కోసం పోరాటం మధ్య ఆలిస్ తీసుకునే నిర్ణయాలు కథను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. ప్రతి సన్నివేశంలో వచ్చే హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. అయితే అసలు దుష్టశక్తి ఎవరు? ఆ శాపానికి ముగింపు ఎలా వస్తుంది? ఆలిస్ ఆ నరకం నుంచి బయట పడుతుందా? అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు మాత్రం సినిమా చూసే తెలుసుకోవాలి.
ఈ సినిమాకు ప్రధాన బలం దాని హారర్ మేకింగ్. దర్శకుడు సెబాస్టియన్ వానిసెక్ భయాన్ని నెమ్మదిగా పెంచుతూ, ప్రతి సన్నివేశాన్ని టెన్షన్‌తో నింపాడు. లూసియాన్ బుకానన్, హంటర్ డూహన్, సౌహీలా యాకూబ్ తమ పాత్రల్లో ఆకట్టుకోగా, గ్రాఫిక్ వయలెన్స్, వన్-షాట్ యాక్షన్ సీక్వెన్సులు, డెడైట్ మేకప్, సౌండ్ డిజైన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో సుమారు 20 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 65 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం దాని విజయానికి నిదర్శనం.
ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, Apple TV, YouTube Movies ప్లాట్‌ఫామ్‌లలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. సినిమాను కొన్న వాళ్ళకి వారికి బిహైండ్ ది సీన్స్, మేకింగ్ వీడియోలు వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా లభిస్తాయి. భయాన్ని నిజంగా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఈ సినిమాను డోంట్ మిస్. మొదటి నిమిషం నుంచే ఉత్కంఠను పెంచుతూ, చివరి వరకు భయాన్ని తగ్గనివ్వని ఈ హారర్ థ్రిల్లర్ హారర్ జానర్ అభిమానులకు మంచి ట్రీట్ అవుతుంది.
Read Also: ఒరిజినల్ ఏనుగుతో షాకింగ్ యాక్షన్… తెలుగులోనే సునీల్ మలయాళం మూవీ ‘కాటాలన్’ స్ట్రీమింగ్