Bollywood:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘నేను శైలజ’ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న కీర్తి సురేష్(Keerthi Suresh).. ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈమె, దసరా (Dasara) సినిమాలో నాని (Nani)సరసన గ్లామరస్ గా నటించి, అబ్బురపరిచింది. ఇక అలా పలు చిత్రాలతో, పలు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్.. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ద్వారా తొలిసారి గ్లామర్ గా నటించి.. తనలోని మరో యాంగిల్ ని పరిచయం చేసింది. ఇక అప్పటినుంచి తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
బాలీవుడ్ లో మొదలైన ప్రయాణం..
ఇక సౌత్లో తన సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కీర్తి సురేష్, తన చిన్ననాటి స్నేహితుడు, దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆంటోనీ తట్టిల్ (Antony thattil) తో గత ఏడాది ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక వివాహం అయిన తర్వాత ఈమె మొదటిసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా ‘బేబీ జాన్'(Baby John) అనే సినిమాలో నటించింది. ఇకపోతే అక్కడ అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప2’ సృష్టించిన ప్రభంజనానికి ఈ బేబీ జాన్ సినిమా నిలబడలేకపోయింది. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య సినిమా విడుదల అయ్యింది. కానీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పవచ్చు. మాస్ ఎలిమెంట్స్ కి అలవాటు పడిన నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించలేకపోయారు.
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేష్ బేబీ జాన్..
ఇకపోతే ఈ సినిమా బాలీవుడ్లో పెద్దగా మెప్పించకపోవడంతో థియేటర్ల నుంచి కూడా తీసేశారు. అయితే ఇప్పుడు అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 14 లోపు ఫ్రీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుందని సమాచారం. ఇక ఈ సినిమాలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్ర పోషించారు. కోలీవుడ్లో సమంత (Samantha), విజయ్ దళపతి(Vijay thalapathy)నటించిన తేరీ(పోలీసోడు) సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
కీర్తి సురేష్ కెరియర్..
ఇకపోతే బేబీ జాన్ సినిమాలో అవకాశం రావడానికి కారణం సమంత అని తెలిపింది కీర్తి సురేష్. ఇకపోతే సమంత సహాయంతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది కానీ మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు భర్తతో కలిసి గోవా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దగుమ్మ.. త్వరలోనే మళ్లీ తన సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కీర్తి సురేష్ అటు వైవాహిక జీవితంతో పాటు ఇటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ కెరియర్లో ముందుకు సాగుతోంది అని చెప్పవచ్చు. ఇక అంతేకాదు ఈ జంటను చూసిన అభిమానులు త్వరలో గుడ్ న్యూస్ చెప్పాలని కూడా కోరుతున్నారు.