Ricky Ponting Wine: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. రికీ పాంటింగ్ { Ricky Ponting} అత్యంత విజయవంతమైన ఆస్ట్రేలియన్ కెప్టెన్లలో ఒకరు. తన దేశాన్ని రెండు ప్రపంచకప్ టైటిల్స్ ను గెలుచుకునేలా చేయడంలో రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {Indian Premier League} IPL లో ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ టైటిల్ గెలుపులో కూడా కీలకపాత్ర పోషించాడు.
Also Read: Rashid Khan: T20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ సంచలన రికార్డు.. చరిత్రలోనే తొలి ప్లేయర్!
1995 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసినప్పటి నుండి ఎన్నో విజయాలను ఆస్ట్రేలియాకు అందించాడు. తన 15 సంవత్సరాల కెరీర్ లో రికీ పాంటింగ్ { Ricky Ponting} 168 టెస్ట్ ఇన్నింగ్స్ లలో 13,378 పరుగులు చేశాడు. ఇందులో 257 హైయెస్ట్ స్కోర్. టెస్టుల్లో 41 సెంచరీలు చేసిన రికీ పాంటింగ్.. 62 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశాడు. వన్డేల్లో 30 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
అలాగే 17 టీ-20 ల్లో 401 పరుగులు చేసిన రికీ పాంటింగ్.. రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాను మూడుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిపాడు. తన కెప్టెన్సీలో పాంటింగ్ 230 మ్యాచ్ లలో ఆస్ట్రేలియాకు 165 వన్డే విజయాలను అందించాడు. ఇక పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కి హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ కి అత్యధికంగా ఏడు సంవత్సరాలు హెడ్ కోచ్ గా పని చేసిన పాంటింగ్.. అతడి మార్గదర్శకంలో ఢిల్లీ మిశ్రమ ఫలితాలను అందుకుంది.
అత్యుత్తమంగా 2020లో ఫైనల్ కీ చేరిన ఢిల్లీ రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఈసారి అతని మార్గదర్శకంలో పంజాబ్ కింగ్స్ ని ఐపీఎల్ విజేతగా నిలిపేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఇక రికీ పాంటింగ్ { Ricky Ponting} తన పేరుతో “పాంటింగ్ వైన్స్” అనే బ్రాండ్ ని గతంలోనే ప్రారంభించాడు. ఈ బ్రాండ్ లో రెడ్ వైన్, వైట్ వైన్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి రికీ పాంటింగ్ వైన్స్ లోని రకాలను చూస్తే.. పాంటింగ్ ఫస్ట్ సెషన్ సౌవియోన్ బ్లాంక్ 2020, పాంటింగ్ మౌబ్రే బాయ్ పినోట్ నోయట్ 2019, పాంటింగ్ ది పీక్ షిరాజ్ 2017, వంటి బ్రాండ్ లు ఉన్నాయి.
Also Read: Bumrah – Varun: ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్.. అతను వస్తున్నాడు !
వీటిని ఇండియాలో కూడా పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు రికీ పాంటింగ్. అయితే తాజాగా తన కంపెనీ పాంటింగ్ వైన్స్ పై భారతీయులు ఆసక్తి చూపించడం లేదని అన్నాడు. ఇండియాలో తన బ్రాండ్స్ ని పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పేర్కొన్నాడు. ఢిల్లీలో తన కంపెనీ మద్యం బాగానే అమ్ముడు అవుతుందని.. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు. కానీ ఇక్కడ పన్నులు, టారిఫ్ లు సవాళ్లుగా మారాయన్నాడు రికీ పాంటింగ్.