Janvi Kapoor : బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ లోనే మొదటి సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంటర్ చేసిన ఆమె ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి అందర్నీ మెప్పించింది.. గ తేడాది గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకునే అమ్మడు ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ సరసన మరో సినిమాలో నటిస్తుంది.. జాన్వి కపూర్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకుంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఫాన్స్ ని టెన్షన్ పెడుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
జాన్వీ కపూర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటోని షేర్ చేసుకుంది. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టిండా వైరల్ గా మారింది.. ఆ ఫోటోలో జాన్వి కపూర్ బ్యాక్ సైడ్ మొత్తం వీపు ఎర్రగా కమిలిపోయి కనిపిస్తుంది. చూసిన ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఏమైంది అంతగా షూటింగ్లో పాల్గొంటున్నారా లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా పరామర్శిస్తున్నారు. జాన్వీ కపూర్ ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్లనే ఎర్రగా బొబ్బలొచ్చాయి. వీపు భాగం ఎర్రగా మారిపోయింది. జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీ ఈ సంగతిని బయటపెట్టింది. సెల్ఫీలో జాన్వీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. క్యాప్షన్ `బర్న్ట్`అని రాసింది..
జాన్వి కపూర్ అసలు నిజం చెప్పకపోయినా కూడా జనాలు ఈజీగా తెలుసుకుంటున్నారు. కొచ్చిలో షూటింగ్ టైం లోనే ఎండకు ఇలా జరిగిందని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక జాన్వీ మాత్రమే కాదు సిద్ధార్థ్ కూడా షూటింగ్ నుంచి గతంలో కొన్ని ఫోటోలను విడుదల చేయగా వైరల్ అయ్యాయి. ఓ చక్కని ప్రేమకథా చిత్రంలో ఈ అందమైన జంట నటిస్తోంది. కేరళలోని ఉత్కంఠభరితమైన బ్యాక్ వాటర్స్ నేపథ్యం లో ని ప్రేమకథ ఆద్యంతం అదిరిపోయే ట్విస్టులతో ప్రేమికులను ఆకట్టుకునే కథతో ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది.. ఇందులో సిద్ధార్థ్ ఢిల్లీ యువకుడి పాత్రలో నటించాడు. అలాగే జాన్వికపూర్ తెలుగులో కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్ సి 16 సినిమాలో నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ అయినట్లే.. దేవర మూవీతో తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. రామ్ చరణ్ తర్వాత ప్రభాస్ లేదా మహేష్ బాబుతో ఓ మూవీ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.