E-Paper
Advertisement

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ
Advertisement

AKKA OTT: క్రైమ్ థ్రిల్లర్ కథల్లో ఇప్పటివరకు ఎన్నో రకాల గ్యాంగ్‌స్టర్ ప్రపంచాలను చూశాం. కానీ ఒక ప్రాంతం మొత్తం మహిళల ఆధీనంలో ఉండి, అక్కడి నేర సామ్రాజ్యాన్ని గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ నడిపిస్తుంటే ఎలా ఉంటుంది ? అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన వెబ్ సిరీసే ‘అక్క’ (AKKA). మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh), వర్సటైల్ నటి రాధికా ఆప్టే (Radhika Apte) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో ఇద్దరు శక్తివంతమైన మహిళల మధ్య ఆధిపత్య పోరును చూపించారు. 1980ల నాటి నేపథ్యం, మాఫియా సామ్రాజ్యం, బ్లడీ బ్లడ్ బాత్ తో ఈ కథ సాగుతుంది. మరి ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ మధ్య గొడవకు కారణమేంటి ? ఈ సిరీస్ తాజాగా ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1980ల కాలంలో పెర్నూరు అనే కల్పిత దక్షిణ భారత ప్రాంతంలో మొదలవుతుంది. ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ తరతరాలుగా మహిళలదే ఆధిపత్యం. వ్యాపారాల నుంచి నేర సామ్రాజ్యం వరకు అన్నింటినీ మహిళలే నడిపిస్తుంటారు. తమకంటూ ప్రత్యేకమైన నియమాలు పెట్టుకుని, ఒకరికొకరు అండగా ఉంటూ ఈ మహిళా గ్యాంగ్‌స్టర్లు తమ అధికారాన్ని కాపాడుకుంటారు. ఈ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉండే మహిళను ‘అక్క’ అని పిలుస్తారు. అలాంటి పెర్నూరులో భవానీకి తిరుగులేని ఆధిపత్యం ఉంటుంది.

Advertisement

తరతరాలుగా వస్తున్న తమ సామ్రాజ్యాన్ని, కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడమే భవానీ లక్ష్యం. అయితే ఆమె అధికారానికి సవాలుగా రుద్ర రంగంలోకి దిగుతుంది. రుద్ర ఎవరి మాట వినే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. తనకంటూ ప్రత్యేకమైన ఆశయాలు, ఆలోచనలు కలిగిన తిరుగుబాటు స్వభావం ఉన్న గ్యాంగ్‌స్టర్. భవానీ కొనసాగిస్తున్న పాత వ్యవస్థను సవాలు చేస్తూ తనదైన మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తుంది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది.

మరోవైపు పెర్నూరులోని ఈ మహిళా సామ్రాజ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి ఓ బయటి వ్యక్తి ప్రవేశిస్తాడు. అతని రాకతో ఇప్పటికే భవానీ, రుద్ర మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రమవుతాయి. ఒకవైపు తమ అధికారాన్ని కాపాడుకోవాలనే భవానీ ప్రయత్నం, మరోవైపు తనకు ఎదురైన అడ్డంకులను తొలగించుకుని ఆధిపత్యం సంపాదించాలనే రుద్ర ఆలోచన.. ఈ రెండింటి మధ్య పెర్నూరు అట్టుడుకుతుంది. ఈ క్రమంలో కుట్రలు, ప్రతీకారాలతో నేర సామ్రాజ్యంలో రక్తపాతం మొదలవుతుంది.

Advertisement

అసలు బయటి నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ? అతని లక్ష్యం ఏమిటి ? భవానీ, రుద్రల్లో ఎవరి వైపు ఎక్కువ మంది నిలబడతారు ? తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఇద్దరు మహిళలు ఏం చేస్తారు ? పెర్నూరుపై చివరకు ఎవరి ఆధిపత్యం నిలుస్తుంది ? అనేదే ఈ సిరీస్‌లో చూడాల్సిన ఆసక్తికరమైన విషయం.

తెలుగులోనూ ‘అక్క’ స్ట్రీమింగ్

‘అక్క’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ (YRF Entertainment) నిర్మించిన ఈ సిరీస్‌కు ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. దర్శకుడు ధర్మరాజ్ శెట్టి (Dharmaraj Shetty) ఈ కథను పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించారు. కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో పాటు తన్వి ఆజ్మీ (Tanvi Azmi), అన్షుమాన్ పుష్కర్ (Anshumaan Pushkar), పూర్ణిమ ఇంద్రజిత్ (Poornima Indrajith), విశాఖ్ నాయర్ (Vishak Nair), మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar), మోనికా పన్వర్ (Monika Panwar) తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Read Also: శవాన్ని కూడా వదలని సైకో… వరుస హత్యలతో పోలీసులకే వణుకు పుట్టించే థ్రిల్లర్

Tags

Related News

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్

తాగుడు అలవాటుతో ఊరంతా రచ్చ… తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ గోల చూస్తే నవ్వు ఆగదు

మిస్సింగ్‌ కేసులో బయటపడే తలలేని శవం… ట్విస్టులతో మతిపోగొట్టే తెలుగు సిరీస్

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్..!

ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్ నాన్‌స్టాప్ ఫన్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’… తెలుగులోనూ స్ట్రీమింగ్

శవాన్ని కూడా వదలని సైకో… వరుస హత్యలతో పోలీసులకే వణుకు పుట్టించే థ్రిల్లర్

42 ఏళ్ల బంధానికి టాటా… గుహలోకి వెళ్ళి 20 ఏళ్ల యంగ్ కపుల్ గా రీఎంట్రీ… ఫాంటసీ రొమాంటిక్ సిరీస్ తెలుగులోనే

Big Stories

Advertisement
×