E-Paper
Advertisement

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్

వామ్మో… పోలీసులే దొంగలు భయ్యా… దిమ్మతిరిగే హీస్ట్ థ్రిల్లర్
Advertisement

Spanish Crime Thriller: బ్యాంకులో దోపిడీ జరిగితే పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం గాలిస్తారు. కానీ ఆ దోపిడీ చేసింది పోలీసులే అయితే… పైగా ఆ కేసును దర్యాప్తు చేసే బాధ్యత కూడా వాళ్లకే అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ ‘కొలిజన్ కోర్స్’ (Collision Course) ఓటీటీలోకి వచ్చింది. భారీ దోపిడీ, అనుకోని రోడ్డు ప్రమాదం, పోలీసుల ముసుగులో దాగిన దొంగలు… అసలు ఈ సినిమా కథేంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో ఏ భాషల్లో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 2013లో స్పెయిన్‌ ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సమయంలో మొదలవుతుంది. మేడ్రిడ్ నగరంలో ఓ ప్రొఫెషనల్ దొంగల ముఠా భారీ బ్యాంక్ దోపిడీకి పక్కా ప్లాన్ వేస్తుంది. అనుకున్నట్టుగానే బ్యాంకులోకి చొరబడి కోట్లాది రూపాయల విలువైన డబ్బును దోచుకుంటారు. పోలీసులకు చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వేర్వేరు కార్లలో బయలుదేరుతారు. అయితే వారి ప్లాన్‌ ను ఒక్కసారిగా తలకిందులు చేస్తూ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరుగుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఆ బ్యాంకును దోచుకున్నది సాధారణ దొంగల ముఠా కాదు… చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారుల బృందం. దోపిడీ తర్వాత జరిగిన ప్రమాదంతో వ్యవహారం ఊహించని టర్న్ తిరుగుతుంది.

Advertisement

ఎందుకంటే ఈ బ్యాంక్ రాబరీ కేసును దర్యాప్తు చేసే బాధ్యత కూడా అదే పోలీస్ టీమ్‌కు అప్పగిస్తారు. దీంతో తాము చేసిన నేరాన్ని తామే విచారిస్తున్నట్టు నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు దోపిడీ రహస్యం బయటపడకుండా జాగ్రత్త పడుతూనే, మరోవైపు దర్యాప్తును తమకు అనుకూలంగా నడిపించేందుకు ఆ అధికారులు ప్రయత్నిస్తారు. కానీ ముఠాలోని సభ్యుల మధ్య నమ్మకం క్రమంగా దెబ్బతింటుంది. గతంలో దాచిపెట్టిన పగలు, వ్యక్తిగత రహస్యాలు, ఒకరిపై ఒకరు చేసిన ద్రోహాలు బయటపడటంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి. అసలు ఈ దోపిడీ ప్లాన్ ఎవరిది ? ప్రమాదం తర్వాత డబ్బు ఏమైంది ? ముఠాలో ఎవరైనా తమ టీంను మోసం చేశారా ? చివరికి ఆ భారీ దోపిడీ సొమ్ము ఎవరికి దక్కుతుంది ? పోలీసులుగా కనిపిస్తూ నేరస్తులుగా బతుకుతున్న ఈ బృందం నుంచి ఎవరు బయటపడతారన్నదే మిగతా కథ.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘కొలిజన్ కోర్స్’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పానిష్‌తో పాటు ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆడియో అందుబాటులో ఉంది. లైయా కోస్టా (Laia Costa), కర్రా ఎలిజాల్డే (Karra Elejalde), లూయిస్ జహెరా (Luis Zahera), తమర్ నోవాస్ (Tamar Novas), ఆల్వారో సెర్వాంటెస్ (Álvaro Cervantes), ల్లుయిస్ హోమర్ (Lluís Homar) కీలక పాత్రల్లో నటించారు. డానియల్ సాంచెజ్ అరేవాలో (Daniel Sánchez Arévalo) దర్శకత్వం వహించగా, రామన్ కాంపోస్ (Ramón Campos), డానియల్ సాంచెజ్ అరేవాలో కథను అందించారు. బాంబూ ప్రొడక్షన్స్ నిర్మించింది.

Advertisement

Read Also: పిచ్చాసుపత్రి బేస్మెంట్లో సైకోపాత్… మిస్సైన అమ్మాయి కోసం వేట… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

పద్ధతిగా జరిగే పిల్లల బర్త్ డే పార్టీ… పెద్దల మధ్య చిచ్చుపెట్టే బహుమతి… ఈ రచ్చ తెలుగులోనూ స్ట్రీమింగ్

గ్యాంగ్‌స్టర్లుగా కీర్తి సురేష్, రాధికా ఆప్టే… తెలుగులోనూ డార్క్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

తాగుడు అలవాటుతో ఊరంతా రచ్చ… తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ గోల చూస్తే నవ్వు ఆగదు

మిస్సింగ్‌ కేసులో బయటపడే తలలేని శవం… ట్విస్టులతో మతిపోగొట్టే తెలుగు సిరీస్

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్..!

ఓటీటీలోకి వచ్చేసిన ఫహాద్ నాన్‌స్టాప్ ఫన్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’… తెలుగులోనూ స్ట్రీమింగ్

శవాన్ని కూడా వదలని సైకో… వరుస హత్యలతో పోలీసులకే వణుకు పుట్టించే థ్రిల్లర్

Big Stories

Advertisement
×