OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ లవర్స్ థియేటర్లకు వెళుతూ ఉంటారు. అయితే బుల్లితెరలో వచ్చే ఓటిటి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి అసలు వేదికగా మారిపోయింది. థియేటర్లకు వెళ్లకుండానే ఓటీటీలో నచ్చినవి చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పెళ్లి అయినా కూడా భార్యతో గడపడానికి ఇబ్బంది పడే భర్త చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మలయాళం డ్రామా మూవీ పేరు ‘కెత్యోలాను ఎంత మాలాఖా’ (Ketteolanu ente malakha). 2019లో విడుదలైన ఈ మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీకి నిస్సామ్ బషీర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆసిఫ్ అలీ, వీణా నందకుమార్, జాఫర్ ఇడుక్కి, బాసిల్ జోసెఫ్, షైన్ టామ్ చాకో నటించారు. విలియం ఫ్రాన్సిస్ ఈ మూవీకి సంగీతం సమకూర్చారు. కొత్తగా పెళ్లయిన స్లీవచన్, రిన్సీ వారి వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలతో స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుని, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో మొదటినుంచి అమ్మాయిలకు చాలా దూరంగానే ఉంటాడు. తనకి నలుగురు అక్కలు ఉంటారు. వాళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయినా ఒంటరిగానే ఉంటాడు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో తల్లి అనారోగ్యంతో బాధపడుతూ స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన హీరో తల్లిని చూసి కంగారుపడి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్క లందరూ హీరోని బాగా తిడతారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు హీరో. ఈ క్రమంలోనే చర్చ్ ఫాదర్ కి తెలిసిన ఒక కుటుంబంలో అమ్మాయిని చూడటానికి వెళ్తారు. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరి ఉంటుంది. అయితే హీరో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడి, హీరోయిన్ తల్లితో కూడా మంచిగా మాట్లాడి వస్తాడు. హీరోయిన్ తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీద పడి ఉంటుంది. తనని చూసి తన తల్లిని కూడా అలా చూసుకుంటుంది నా భార్య అనుకుంటూ పెళ్లికి ఓకే చెప్తాడు.
కొద్ది రోజుల్లోనే వీళ్ళకు పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇంటికి వచ్చిన భార్యతో గడపడానికి బాగా భయపడుతూ ఉంటాడు హీరో. హనీమూన్ కు ప్లాన్ చేసినా, అక్కడ కూడా తనతో గడపడానికి మొహమాటపడుతుంటాడు. నిజానికి హీరో ఒక మంచి వ్యక్తి, భార్యతో ఎలా గడపాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉండటంతో ఈ సమస్యని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో, మద్యం సేవించి రెచ్చిపోతాడు. దీంతో స్పృహ కోల్పోతుంది హీరోయిన్. ఇంట్లో ఉన్నవాళ్లు హీరోని బాగా తిడతారు. తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయిస్తారు. ఆ తర్వాత హీరో భార్యని ప్రేమించడం మొదలు పెడతాడు. కానీ తన ప్రేమని కూడా వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. చివరికి హీరో తన భార్యతో జీవితాన్ని పంచుకుంటాడా? తన ప్రేమని భార్యకి చెప్పగలుగుతాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.