E-Paper
Advertisement

Horoscope  Today March 25th: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

Horoscope  Today March 25th: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. మార్చి 25న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Advertisement

వృషభం: కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమ అధికమవుతుంది.

మిధునం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన శుభకార్య విషయమై కుటుంబ సభ్యులతో చర్చలు జరుగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement

కర్కాటకం: భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందవు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

సింహం: దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

కన్య: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

తుల: సంతానం విద్యా, ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. భూ క్రయవిక్రయాలలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

ధనస్సు: దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయట పడతారు.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి.

మకరం: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

మీనం: వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×