OTT Movie : హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంటాయి. ఈ స్టోరీలు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ, గ్రాఫిక్ వయోలెన్స్, ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకుంటుంది. ఇందులో ఒక మగవాడిపై , మరో ముగ్గురు మగవాళ్ళు అఘాయిత్యం చేస్తారు. ఆతరువాత స్టోరీ రివెంజ్ థ్రిల్లర్ గా మారుతుంది. ఇందులో కథానాయకుని పాత్రలో నటించిన బ్రియాన్ ఓ’హాలోరన్ నటనను చాలా మంది ప్రశంసించారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
విల్ కార్ల్‌సన్ న్యూజెర్సీలో నివసిస్తుంటాడు. ఇతను పిల్లల పుట్టినరోజు పార్టీలో క్లౌన్ గా పనిచేస్తుంటాడు. అయితే అతని జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. అతను డబ్బు సమస్యలతో సతమవుతుంటాడు. అతని తల్లి నర్సింగ్ హోమ్ ఖర్చులను చెల్లించడానికి ఇబ్బంది పడుతుంటాడు. అతని స్నేహితుడు సిడ్, మరికొంతమంది వల్ల అతని పరిస్థితి ఇంకా దిగజారుతుంటుంది. ఇక డబ్బు సంపాదించడానికి, విల్ ఒక కొత్త ఆలోచనతో వెళ్తాడు. బ్యాచిలర్ పార్టీల కోసం “వల్గర్ ది క్లౌన్” గా పనిచేయడం. ఇక్కడ మగాళ్లను నవ్వించడానికి లోదుస్తులు ధరించి కనిపిస్తాడు.
అతని మొదటి బ్యాచిలర్ పార్టీలో, విల్ మగవాళ్ళ చేతిలోనే దారుణంగా అఘాయిత్యానికి గురవుతాడు. ఈ దాడి వీడియో టేప్‌లో రికార్డ్ కూడా చేయబడుతుంది. ఈ ఘటన విల్‌ను తీవ్రమైన డిప్రెషన్‌లోకి నెట్టివేస్తుంది. అతను తన ఇంటిని కోల్పోయే ప్రమాదంలో కూడా ఉంటాడు. అయితే ఈ ఘటన మీద అతను పోలీసులకు రిపోర్ట్ చేయడానికి నిరాకరిస్తాడు. అయితే ఇక చేసేదేంలేక అతను తన సాధారణ క్లౌన్ ఉద్యోగంలో కొనసాగుతాడు. ఒక రోజు, ఒక పిల్లల పుట్టినరోజు పార్టీలో, విల్ ఒక అమ్మాయిని రక్షిస్తాడు. ఈ సంఘటన మీడియాలో వైరల్ అవుతుంది. విల్ “హీరో క్లౌన్”గా జాతీయ గుర్తింపు పొందుతాడు. ఫలితంగా అతనికి ఒక సిండికేటెడ్ చిల్డ్రన్స్ టెలివిజన్ షోలో అవకాశం కూడా లభిస్తుంది.
అయితే విల్ మీద దాడి చేసిన వాళ్ళు, ఆ వీడియో టేప్‌తో అతనిని బ్లాక్‌మెయిల్ చేస్తారు. 50,000 డాలర్లు డిమాండ్ చేస్తూ అతని కెరీర్‌ను నాశనం చేయడానికి బెదిరిస్తారు. విల్ వాళ్ళకి డబ్బు చెల్లిస్తాడు. కానీ వాళ్ళు ఆ టేప్‌ను అందజేయకుండా మరో రాత్రి అతనితో గడపాలని డిమాండ్ చేస్తారు. ఇక విల్ ఈ ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? విల్ ప్రతీకారం తీర్చుకుంటాడా ? అతని సమస్యలు తీరిపోతాయా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
ఎందులో ఉందంటే
‘Vulgar’ ఒక అమెరికన్ బ్లాక్ కామెడీ క్రైమ్ సినిమా. దీనికి బ్రయాన్ జాన్సన్ డైరెక్ట్ చేశారు. ఇందులో బ్రియాన్ ఓ’హాలోరన్ (విల్ కార్ల్‌సన్/వల్గర్), బ్రయాన్ జాన్సన్ (సిడ్), జెర్రీ లెవ్కోవిట్జ్ (ఎడ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 27 నిమిషాల ఈ సినిమాకి IMDbలో 5.2/10 రేటింగ్ ఉంది. 2000 ఏప్రిల్ 26న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం Amazon Prime Video, Apple TV, Fandango At Home లో అందుబాటులో ఉంది.
Read Also : తాగుబోతు పోలీస్ బయటపెట్టే బండారం… అలాంటి కేసులో భార్యకు లింక్… సీను సీనుకో ట్విస్ట్