OTT Movie : ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మనుషుల జీవితాలను, సినిమాలలో చూపిస్తూనే ఉంటారు. కొన్ని సినిమాలు చూసినప్పుడు వాటిలో మనల్ని కూడా కొన్ని క్యారెక్టర్లలో ఊహించుకుంటాము. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ మూవీలో తల్లిదండ్రులు వదిలేసిన అన్న, చెల్లెల కథ ఉంటుంది. ఈ స్టోరీ మనసుకు హత్తుకుంటుంది. ఒంటరి మనుషులు ఇటువంటి సినిమాలు చూస్తే కాస్త ధైర్యం వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ్ మూవీ పేరు ‘కోజిపన్నై చెల్లదురై’ (Khoji pannai chella durai). 2024 లో విడుదలైన ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీకి శీను రామ స్వామి దర్శకత్వం వహించారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందుడు దీనిని నిర్మించారు. ఇందులో ఏగన్, యోగి బాబు , బ్రిగిడా సాగా , సత్యాదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
వీరుమన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటాడు. ఇతని భార్య చిత్ర ఇంటి దగ్గరే ఉంటుంది. ఎక్కువ రోజులు భర్త రాకపోవడంతో పక్కనే ఉండే శ్రీరామ్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఆర్మీ నుంచి తిరిగి వచ్చిన వీరుమన్ కి విషయం తెలిసిపోతుంది. ఇద్దరిని బంధించి చంపాలని చూస్తాడు వీరుమన్ . అక్కడినుంచి ఎలాగో వాళ్ళిద్దరూ తప్పించుకుని పారిపోతారు. వీళ్ళిద్దరికీ చల్లాదొరై, సుధా అనే కొడుకు, కూతురు ఉంటారు. వీరుమన్ పిల్లల్ని తన అత్త దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. ఆమె బాగా ముసలామె కావడంతో వాళ్లను ఎలా పెంచాలని బాధపడుతుంది. కొద్ది రోజుల్లో ఆమె కూడా చనిపోతుంది. వీళ్ళిద్దరిని వరసకు బంధువైన పెరిస్వామీ అనే వ్యక్తి పెంచుతాడు. సుధని, చల్లా దొరైని స్కూల్లో చేర్పిస్తాడు. అయితే సుధని చదువుతుంటే, చల్లా దొరై పెరి స్వామి దగ్గరే పని చేస్తాడు. వీళ్లిద్దరూ పెద్దవాళ్లు కూడా అయిపోతారు. అయితే సుధని ఒక వ్యక్తి ప్రేమిస్తుంటాడు. ఈ విషయం తెలిసి చల్లా దురై కి బాగా కోపం వస్తుంది. ఆ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లి కొడతాడు. ఆ తర్వాత చెల్లితో తల్లి లాగా అవ్వద్దని వార్నింగ్ ఇస్తాడు.
అయితే ఆ వ్యక్తి మంచి వాడని తెలిసి వాళ్లకి చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంటాడు. గుడిలో దేవుడికి పూజ చేసి బిచ్చగాళ్ళకి బిచ్చం వేస్తుంటాడు. అక్కడ ఇతని తల్లి కూర్చుని ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి చల్లా దొరై కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత తండ్రి కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ విషయం తెలుసి తన కిడ్నీని తండ్రికి ఇస్తాడు. ఆ తర్వాత తండ్రి తో మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. చెల్లి పెళ్లి ఘనంగా జరుగుతుంది. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో, ఆమెను తన దగ్గర జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు తల్లిదండ్రులు చేసే తప్పులకు పిల్లలు శిక్ష అనుభవిస్తుంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది.