India Railways: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రైల్వే లైన్లను విస్తరించడంపై ఫోకస్ పెట్టిన భారతీయ రైల్వే, ఇకపై పొరుగు దేశాల మధ్య రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని మోడీ యాక్ట్ ఈస్ట్ పాలసీ, నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా పక్క దేశాల్లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగానే అస్సాం కోక్రాఝర్ నుంచి భూటాన్ గెలెఫు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ రైల్వే లైన్ కారణంగా అస్సా-భూటాన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడనుంది. ఈ రైల్వే లైన్ కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇప్పటికే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధంచి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
ఈ రైల్వే లైన్ కు ఎంత ఖర్చు అవుతుందంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే లైన్ కోక్రాఝర్- గెలెఫు స్టేషన్ ను కనెక్ట్ చేస్తుంది. ఈ లైన్ మొత్తం 69.04 కిలో మీటర్ల పరిధిలో ఉంటుంది. కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సుమారు రూ.3,500 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని రైల్వేశాఖ అంచనా వేసింది. ఈ రైల్వే లైన్ మార్గంలో సుమారు 6 కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. బాలాజన్, గరుభాసా, రునిఖాతా, శాంతిపూర్, దాద్ గిరి, గెలెఫు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు.
ఇప్పటికే డీపీఆర్ రెడీ చేసిన అధికారులు
ఇక ఇప్పటికే ఈ రైల్వే లైన్ కు సంబంధించి అధికారులు డీపీఆర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. కోక్రాఘార్ రైల్వే స్టేషన్ నుంచి గెలెఫు రైల్వే స్టేషన్ మధ్య రెండు ప్రధాన వంతెనలను నిర్మించాల్సి ఉంటుంది. వీటికి తోడుగా మరో 29 వంతెలను నిర్మించనున్నారు. 65 చిన్న వంతెలను, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి,39 అండర్ రోడ్ వంతెలను కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయ్యింది. డీపీఆర్ ను కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు తెలుస్తోంది. త్వరలో డీపీఆర్‌కు ఆమోదం తెలపడంతో పాటు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే భారత్- భూటాన్ మధ్య కొత్త రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!
కొత్త రైల్వే లైన్ తో ఇరు దేశాలకు మేలు
ఇక తాజా రైల్వే లైన్ నిర్మాణంతో భారత్ – భూటాన్ మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఇరు దేశాల నడుమ వాణిజ్యం, పర్యాటక సంబంధాలు బలోపేతం కానున్నాయి. భూటాన్ రవాణా వ్యవస్థలో ఇదో కీలక మలుపు కానుంది. బోడోలాండ్ వాణిజ్య అవసరాలను ఈ రైల్వే లైన్ తీర్చే అవకాశం ఉంది. స్థానికంగా వాణిజ్యం పెరగడంతో పాటు అక్కడి ప్రజలకు ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. ఈ రైల్వే లైన్ కారణంగా బోడోలాండ్ ఆర్థిక వ్యవస్థ సైతం బలోపేతం కానుంది. మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
Read Also: జనరల్ టికెట్ రూల్స్ మారుతున్నాయ్.. ఇకపై అలా చేస్తే కుదరదు!