BigTV English

Max Movie OTT Release : వారం ముందుగానే ఓటీటీలోకి నాని విలన్ భారీ యాక్షన్ థ్రిల్లర్… తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Max Movie OTT Release : వారం ముందుగానే ఓటీటీలోకి నాని విలన్ భారీ యాక్షన్ థ్రిల్లర్… తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Max Movie OTT Release : కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తెలుగులో ఆయన పెద్దగా సినిమాలు చేయకపోయినా ‘ఈగ’ (Eega) మూవీలో నాని (Nani) విలన్ గా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మ్యాక్స్’ (Max) ఓటీటీలో స్ట్రీమింగ్ సిద్ధమవుతోంది. కన్నడలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తెలుగులో కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. పైగా వారం ముందుగానే ఓటీటీ ప్రేక్షకులకు ఈ మూవీ స్ట్రీమింగ్ తో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? తెలుగులో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు? అన్న వివరాల్లోకి వెళితే…


వారం ముందుగానే ఓటీటీలోకి ‘మ్యాక్స్’

కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మ్యాక్స్’. 2024 డిసెంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన ‘మ్యాక్స్’ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ మూవీతోనే కమెడియన్ నటుడు సునీల్ కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడిన ఈ మూవీ తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.


ఒకేసారి డిజిటల్, టెలివిజన్ ప్రీమియర్ 

ముందుగా ‘మ్యాక్స్’ మూవీ ఫిబ్రవరి 22 నుంచి ఓటీటీలోకి రాబోతోందని ప్రకటించారు. కానీ తాజాగా అనుకున్న సమయాని కంటే వారం ముందుగానే రిలీజ్ చేస్తున్నాం అంటూ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొన్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది. ఈనెల 15 నుంచి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషలో ఈ మూవీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించి, సుదీప్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అలాగే ఈ సినిమాను కన్నడ ‘జీ’ చానల్లో అదే రోజు రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయడానికి సిద్ధమవుతున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో రూపొందిన ఈ మూవీ ఒకేసారి ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్ తో పాటు, అటు టెలివిజన్ ప్రీమియర్ కూడా కాబోతోంది.

మ్యాక్స్ స్టోరీ ఇదే…

ఈ సినిమాలో సుదీప్ ‘మ్యాక్స్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఆయన సిఐ అర్జున్ అలియాస్ మ్యాక్స్. అప్పటికే పలు కారణాల వల్ల సస్పెండ్ అయిన మ్యాక్స్ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యే టైంకి మరో వివాదంలో కాలు మోపుతాడు. ఆయన డ్యూటీకి వెళ్తున్న క్రమంలో ఓ లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇద్దరినీ చితక్కొట్టి, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పారేస్తాడు. తర్వాత వారిద్దరూ మంత్రుల కొడుకులని తెలిసినప్పటికీ వదిలి పెట్టడు. మరోవైపు ఆ మంత్రులు ఎమ్మెల్యేలను కొని సీఎంను గద్దె దించాలని ప్లాన్ చేస్తారు. అంతలో పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ ఇద్దరు మంత్రుల కొడుకులు చనిపోతారు. మరి వారిద్దరూ ఎలా చనిపోయారు? ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర  ఏంటి? కొడుకులు చనిపోయిన విషయం ఆ మంత్రులకు తెలిసిందా లేదా? అనేది కథ.

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×