OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒక హారర్ కామెడీ సినిమా రేపటి నుంచి ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా థియేటర్స్‌లో 25 కోట్లు కలెక్ట్ చేసి, 2025లో 10వ హైయెస్ట్ గ్రాసింగ్ మలయాళం ఫిల్మ్‌గా నిలిచిందని కోయిమోయి నివేదించింది. ఈ కథ 1990 లో కేరళ గ్రామంలోని ఒక రోడ్ లో సుమతి అనే మహిళ ట్రాజిక్ డెత్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ తరువాత అది హాంటెడ్ రోడ్ గా మారుతుంది. ఈ సినిమా కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ, కాస్త ఎమోషనల్ డెప్త్ తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘సుమతి వాళవు’ (Sumathi valavu) 2025లో రిలీజ్ అయిన మలయాళం హారర్ కామెడీ సినిమా. విష్ణు శశి శంకర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ అశోకన్, మాళవిక మనోజ్, సైజు కురుప్, గోకుల్ సురేష్, బాలు వర్గీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 1న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. 2025 సెప్టెంబర్ 26 నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది.
కేరళలో ఉండే మైలమూడు గ్రామంలో, సుమతి మలుపు అనే రోడ్డు దెయ్యం కథలతో అందరినీ భయపెడుతుంటుంది. 1950లలో సుమతి అనే గర్భిణీ తన ప్రేమికుడి చేతిలో దారుణంగా చనిపోయిందని, ఆమె ఆత్మ ఆ మలుపు రోడ్డులో తిరుగుతోందని స్థానికులు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక్కడే అప్పు అనే చిలిపి యువకుడు, తన స్నేహితులతో కలిసి ఈ రోడ్డు మీద అడుగుపెడతాడు. ఒక రాత్రి, వీళ్లు ఆ రోడ్డు మీద వెళ్తూ వింత ఘటనల్లో చిక్కుకుంటారు. అక్కడ చీకటిలో కనిపించే నీడలు, గుండెలు ఆగిపోయే శబ్దాలు వీళ్ళకి చెమటలు పట్టిస్తాయి. వీళ్ళు సుమతి రహస్యాన్ని చేధించే దిశగా అడుగులు వేస్తారు.
ఇప్పుడు అప్పు, అతని గ్యాంగ్ ఈ రోడ్డు సీక్రెట్ ని కనిపెట్టడానికి డిటెక్టివ్ ఆట మొదలెడతారు. ఇంతలో దెయ్యం సన్నివేశాలు గుండెలో గుబులు పుట్టిస్తాయి. కానీ వీళ్ల చిలిపి రియాక్షన్స్ నవ్వు తెప్పిస్తాయి. సుమతి గతం గురించి కొన్ని సెక్రెట్స్ బయటపడతాయి. ఆమె మరణం వెనుక ద్రోహం, ప్రేమ, నేరస్థుల కుట్రలు ఉన్నాయని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో అప్పు గ్యాంగ్ సుమతి దెయ్యం సీక్రెట్ ను తెలుసుకుంటారు. ఆమె మరణం వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? అప్పు, అతని స్నేహితులు తెలుసుకున్న రహస్యాలు ఏమిటి ? అక్కడ నిజంగానే దెయ్యం ఉందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్