OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటిని ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు మూవీ లవర్స్. నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లకుండా నే ఓటిటిలో చూడటం మొదలుపెడుతున్నారు ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే, ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. ఒక చిత్రకారుడికి మ్యాజికల్ పెన్ను దొరకడంతో స్టోరీ ఓ రేంజ్ లోకి వెళుతుంది. ఆపెన్నుతో గీసే ఏ బొమ్మ అయినా ప్రాణం పోసుకుంటూ ఉంటుంది. చివరికి ఆ మ్యాజికల్ పెన్ను వళ్ళ ఎటువంటి సమస్యలు వస్తాయి ? అతని పెయింటింగ్ తో ఊపిరి పోసుకున్న ప్రాణాలు ఏమవుతుంటాయి ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫాంటసీ సినిమాను మిస్ కాకుండా చూడండి.
స్టోరీలోకి వెళితే
హువాన్ ఒక కళాకారుడిగా జీవితంలో ఉన్నత స్థితికి రావాలని కలలు కంటుంటాడు. కానీ సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళకే అవకాశాలు దొరుకుతుండటంతో , పోటీ కూడా ఎక్కువగ ఉన్నందున ఏమీ చేయలేకపోతుంటాడు. తన సొంత గ్రామంలోనే ఏమీ చేయలేక, అవమానాలను ఎదుర్కుంటాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు అతని జీవితం అనూహ్యంగా మారుతుంది. ఒక రోజు అతనికి ఒక ఏలియన్ నుండి మ్యాజిక్ పెన్ ఒకటి లభిస్తుంది. ఈ పెన్నుతో అతను ఏది గీసినా, విచిత్రంగా దానికి ప్రాణం వస్తుంది. ఈ సామర్థ్యంతో, హువాన్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోతాడు. తను కలలు గన్న ప్రపంచాన్ని ఇప్పుడు హువాన్ చూస్తాడు. కానీ అదే సమయంలో అతడు ప్రాణం పోసిన కొన్నిచిత్రాలు గందరగోళం సృష్టిస్థాయి. ఈ క్రమంలో అతను కొన్ని విచిత్రమైన సంఘటనలను ఎదుర్కుంటాడు. చివరికి హువాన్ కి ఆ మ్యాజిక్ పెన్ ఎలా వస్తుంది ? ప్రాణం వచ్చిన బొమ్మలవల్ల ఏమయినా సమస్యలు వస్తాయా ? ఆ ఏలియన్ ఎక్కడనుంచి వచ్చింది ? ఈ స్టోరీకి ఎండింగ్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ చైనీస్ కామెడీ ఫాంటసీ సినిమాను మిస్ కాకుండా చూడండి.
యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్
ఈ చైనీస్ కామెడీ ఫాంటసీ మూవీపేరు ‘కింగ్ ఆఫ్ పెయింటింగ్’ (King of Painting). 2025 లో వచ్చిన ఈ మూవీకి హో జంగ్ దర్శకత్వం వహించారు. దీని స్టోరీ హువాన్ అనే ప్రతిభావంతుడైన చిత్రకారుడి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ చివరివరకూ సరదా సన్నివేశాలతో సాగిపోతుంది.