BigTV English
Advertisement

OTT Movie : బ్యాంక్ క్యాషియర్ దగ్గరకు పాక్కుంటూ వచ్చే డబ్బు… కష్టాలన్నీ తీరినట్టే అనుకునే టైమ్ లో బుర్ర తిరిగిపోయే ట్విస్ట్

OTT Movie : బ్యాంక్ క్యాషియర్ దగ్గరకు పాక్కుంటూ వచ్చే డబ్బు… కష్టాలన్నీ తీరినట్టే అనుకునే టైమ్ లో బుర్ర తిరిగిపోయే ట్విస్ట్

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు అన్నిరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే కూర్చుని వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, నోట్ల రద్దు సమయంలో జరుగుతుంది. చివరివరకూ ఆసక్తికరంగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘చోక్డ్’ (Choked). 2020 లో వచ్చిన ఈ మూవీకి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. గుడ్ బ్యాడ్ ఫిలింస్ బ్యానర్ పై అనురాగ్ కశ్యప్, ధృవ్ జగాసియా, అక్షయ్ థక్కర్ దీనిని నిర్మించారు. ఈ సినిమా 2016 లో భారతదేశంలో జరిగిన నోట్ల రద్దు నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సరితా పిల్లై, సుశాంత్ పిల్లై అనే భర్య భర్తలు ముంబైలోని, ఒక లోయర్ మిడిల్ క్లాస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. వీరికి సమీర్‌ అనే స్కూల్ కి వెళ్ళే కొడుకు ఉంటాడు.సరితా ఒక బ్యాంక్ లో క్యాషియర్‌గా పనిచేస్తుంది. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు సరితా మాత్రమే. సుశాంత్ తరచూ ఉద్యోగం లేకుండా ఉంటాడు. చిన్న చిన్న పనుల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాడు. వీరి వివాహ జీవితం ఆర్థిక ఇబ్బందులు, సుశాంత్ అప్పులతో ఇబ్బందిగా మారుతుంది. ఒక రాత్రి సరితా కిచెన్ సింక్‌లో దాచిన నగదు బండిళ్లను కనిపెడుతుంది. ఇవి అక్కడికి ఒక పైపు లైన్ ద్వారా వస్తాయి. ఈ డబ్బు నిజమైనదని బ్యాంక్‌లో తనిఖీ చేసిన తర్వాత తెలుసుకుంటుంది. సరితా ఆ డబ్బును సుశాంత్ రుణాలు తీర్చడానికి, ఇంటి కోసం ఖరీదైన వస్తువులు కొనడానికి ఉపయోగిస్తుంది. ఈ డబ్బు తన తల్లి ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి వచ్చిందని సుశాంత్‌తో అబద్ధం చెబుతుంది. ఆమె ఈ రహస్యాన్ని దాచడానికి కిచెన్‌ను తాళం వేస్తూ, ఇతరులను దూరంగా ఉంచుతుంది.

మరోవైపు 2016 నవంబర్ 8న ప్రధానమంత్రి మోడీ రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ డీమోనిటైజేషన్ ప్రకటించడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఈ నిర్ణయం సరితా చాలా కలవరపడుతుంది. ఇప్పుడు సరితాకి బ్యాంక్‌లో పని ఒత్తిడి పెరుగుతుంది, కస్టమర్లు కోపంతో ఉంటారు. సుశాంత్ కు అప్పు ఇచ్చిన రెడ్డి అనే వ్యక్తి, పాత నోట్లను కొత్త వాటితో మార్చడానికి సరితాను ఒత్తిడి చేస్తాడు. ఈ సారి సరితా తన పైప్‌లో కొత్త రూ. 2000 నోట్లను కనిపెడుతుంది. దీనితో ఆమె మళ్లీ ఈ డబ్బును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. రెడ్డితో సరితా హోటల్‌లో ఉండటం చూసి, ఆమెకి అతనితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తాడు సుశాంత్. చివరగా సరితా కు ఆ డబ్బుతో సమస్యలు వస్తాయా ? సుశాంత్ కి సరితా మీద అనుమానం పెరుగుతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : దేవుడి పేరుతో ఇదెక్కడి అరాచకంరా సామీ… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

OTT Movie : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ

OTT Movie : యూకేలోని అతిపెద్ద కుంభకోణం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

Big Stories

×