Brahmamudi serial today Episode: రాజ్‌ను పంపిచి లోపలికి వచ్చిన కావ్య అందరినీ తిడుతుంది. మీరందరూ ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా..? ఆయనతో ఎందుకు క్లోజ్ అవుతున్నారు అంటూ విరుచుకుపడుతుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా వాడు నా మనవడే కాదు ఈ ఇంటికి వారసుడు కూడా ఆ విషయం గుర్తు పెట్టుకో నువ్వు అంటుంది. దీంతో కావ్య ఆ విషయం ఆయనకే గుర్తు లేదు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్తుంది. దీంతో స్వప్న అది గుర్తు చేయడానికే మా ప్రయత్నం.. అయినా మేము చేసిన దానికి మెచ్చుకోవడం పోయి తిడతావేంటి అంటుంది. రిసార్ట్స్ లో ఏం జరిగిందో మర్చిపోయారా..? అని అడుగుతుంది కావ్య. దీంతో అపర్ణ గుర్తుంది కాబట్టే అటువంటి తప్పు ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడుతున్నాము. వాడికి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా నీకు దగ్గర చేస్తున్నాము అంటుంది. దీంతో కావ్య అయ్యో అత్తయ్యా మీకు ఎలా చెప్పాలో అర్తం కావడం లేదు. ఆయనకు గుర్తు రావడమే సమస్య అంటుంది. నువ్వు దగ్గర అవడం కాదే.. వాడు అటూ ఇటూ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు అంటూ ఇద్రాదేవి తిడుతుంది. కానీ నాకసలు ఇష్టం లేదు దీనికి నేను అసలు ఒప్పుకోను అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాజ్ ఇంటికి రాగానే ఏంటి బావ ఈరోజు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నావు ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని యామిని అడుగుతుంది. వెడ్డింగ్ కార్డ్స్ నా ఫ్రెండ్ సర్కిల్ లో పంచడానికి వెళ్లాను అని రాజ్ చెప్పగానే.. చెప్తే నేను వచ్చేదాన్ని కదా అంటుంది యామిని.. నువ్వు నిద్ర పోతున్నావు అందుకే డిస్టర్బ్ చేయలేదు అంటాడు రాజ్. యామిని మాత్రం సంతోషంగా థాంక్యూ సో మచ్ బావ పెళ్లి విషయంలో ఇన్ని రోజులు నేను తొందరపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు కూడా తొందర పడుతున్నావు అంటే హ్యాపీగా ఉంది అంటుంది యామిని. ఈ విషయాన్ని వెంటనే మమ్మీ డాడీలతో షేర్ చేసుకోవాలి అని లోపలికి వెళ్లి ఇడ్లీ తిని టేస్ట్ అదిరిపోయింది అంటుంది. దీంతో వైదేహి ఈ టేస్ట్ ఇడ్లీలది కాదు కానీ ఏంటి విషయం అని అడుగుతుంది.
ఈ రోజు బావ ఏం చేశాడో తెలుసా..? మా పెళ్లి పత్రికలు తన ఫ్రెండ్ సర్కిల్ లో పంచాడట అని చెప్తుంది. దీంతో వైదేహి ఇది నిజంగా గుడ్ న్యూస్ బేబీ.. అంటుంది. గుడ్ న్యూస్ అని సింపుల్ గా అంటావేంటి మమ్మీ నేను అడక్కుండానే తనే స్వయంగా పెళ్లి పత్రికలు పంచాడట. వెంటనే నా ప్రెండ్స్‌కు కూడా పంచమన్నాడు తెలుసా.. అంటుంది. నీ ఫ్రెండ్స్ తన ఫ్రెండ్స్ ఏంటి బేబీ.. వెంటనే మన చుట్టాలకు కూడా మీరిద్దరు కలిసే పంచండి అని వైదేహి చెప్తుంది. అవును సంతోషంలో అసలు విషయం మర్చిపోయాను వెంటనే ఈ విషయం నా శత్రువుకు చెప్పాలి అంటూ బెడ్‌రూంలోకి వెళ్లి కావ్యకు ఫోన్ చేస్తుంది. ఈరోజు నీ మాజీ మొగువు అదే నా రాజ్ ఇవాళ మా పెళ్లి పత్రికలు ప్రెండ్స్‌కు పంచాడు. ఇక మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు అంటుంది. దీంతో కావ్య వెటకారంగా అవునా.. నీకో నిజం తెలుసా…? ఉదయమే మా ఇంటికి వచ్చాడు.. తల్లికొడుకులు ఎదురెదురుగా కూర్చుని కడుపునిండా టిఫిన్ చేశాడు. ఇంతకీ ఆ పెళ్లి పత్రికలు ఏ కాలువలో ముంచేశాడో తెలుసుకో అంటూ కాల్ కట్ చేస్తుంది కావ్య. యామిని ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.
సీతారామయ్య, ఇంద్రాదేవి, అపర్ణ కూర్చుని ఆలోచిస్తుంటారు. ఇంతలో కావ్య వస్తుంది. సీతారామయ్య, కావ్యను పిలిచి ఇక నుంచి రాజ్ ఇంటికి వస్తుంటాడు నీకేమైనా ఇబ్బందా అని అడుగుతాడు. ఆయన రావడం నాకెందుకు ఇబ్బంది ఉంటుంది తాతయ్య కానీ మళ్లీ ఆయనకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అనేదే నా భయం అని చెప్తుంది. దీంతో వాడి ప్రాణాలతో ఆడుకోవాలని మాకు మాత్రం ఎందుకు ఉంటుంది కావ్య. అలా అని వదిలేస్లే వాడు మనకు కాకుండా పోతాడు. ఆ యామిని ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. ఆలస్యం చేసే కొద్ది వాడు మనకు దూరమైపోతాడు అంటుంది ఇంద్రాదేవి. అయితే ఆయన ప్రాణాలతో ఉండాలా..? మనకు దూరంగా ఉండాలా..? అనే ప్రశ్న ఎదురైతే ఆయన దూరంగా ఉండటమే మంచిదని నా సమాధానం అంటుంది కావ్య.
అయితే ఎటువంటి అపశృతి జరగకుండా వాడికి గతం గుర్తుకు వస్తే చాలు కదా నీకు అని సీతారామయ్య అడుగుతాడు. ఆయనకు నేను దగ్గరగా ఉండటమే ఆయనకు ప్రమాదం తాతయ్యా.. నా వెంట తిరుగుతూ ఉంటే.. నేను ఆయనకు గతం ఎక్కడ గుర్తు చేస్తానోనని భయంగా ఉంది తాతయ్య అని కావ్య చెప్తుంది. ఆ విషయం మేము చూసుకుంటాం కానీ రేపటి నుంచి నువ్వు వాడికి దూరంగానే ఉండు.. వాడు ఎంత మాట్లాడినా ఎడమొహం పెడమెహంలాగా ఉండు అప్పుడు వాడు నీ ప్రేమ కోసం ఇంట్లో అందరికీ దగ్గర అవుతాడు. మెల్లగా గతం గుర్తు చేసుకుంటాడు అని ఇంద్రాదేవి చెప్పగానే.. దయచేసి ఇలాంటి పరీక్ష నాకు పెట్టకండి నేను ఆయన్ని చూస్తూ అలా ఉండలేను అంటుంది. కానీ నువ్వు మాత్రమే మాకున్న ఒక్క ఆశ.. మా మాట విను వాడు నీ వెంట పడేలా మేము చేస్తాం.. వాడు గతాన్ని తెలుసుకునేలా చేస్తాం.. నువ్వు మాత్రం మౌనంగా ఉండు.. అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది.
కళ్యాణ్ ఏదో రాస్తుంటే ధాన్యలక్ష్మీ వచ్చి భోజనం చేయమని అడుగుతుంది. అప్పు వచ్చాక చేస్తానని చెప్తాడు కళ్యాణ్. దీంతో ధాన్యలక్ష్మీ కోపంగా మొగుడి కోసం పెళ్లాం ఎదురుచూడాలని నువ్వు ఎదురుచూడటం ఏంటని అడుగుతుంది. ఇంతలో అప్పు రాగానే కళ్యాణ్ భోజనం చేద్దాం రా అని అడుగుతాడు. అప్పు నీరసంగా నాకు ఆకలిగా లేదు.. చాలా టైడ్‌గా ఉన్నాను వెళ్లి పడుకుంటాను అని వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ అప్పును తిట్టి.. కళ్యాణ్‌కు వడ్డించకుండా వెళ్లిపోతుంది.
కావ్య దేవుడి ముందు నిలబడి గతం గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. మా మధ్యకు ఆ యామినిని ఎందుకు తీసుకొచ్చావు.. నా జీవితాన్ని ఎందుకు ఇలా మార్చేశావు. అంటూ ప్రాధేయపడుతుంది. మరోవైపు రాజ్, దుగ్గిరాల ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?