E-Paper
Advertisement

విడిపోయిన రాక్‌ బ్యాండ్‌ రీఎంట్రీ… మేఘాలయలో జరిగిన విషాదంతో ఊహించని మలుపు… మ్యూజికల్‌ ఎమోషనల్‌ డ్రామా

విడిపోయిన రాక్‌ బ్యాండ్‌ రీఎంట్రీ… మేఘాలయలో జరిగిన విషాదంతో ఊహించని మలుపు… మ్యూజికల్‌ ఎమోషనల్‌ డ్రామా
Advertisement

Bollywood Musical Drama: మ్యూజిక్‌, ఫ్రెండ్‌షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు ఇండియన్‌ ఓటీటీ ఆడియన్స్‌లో ఎప్పుడూ మంచి క్రేజ్‌ ఉంటుంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ‘రాక్ ఆన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బ్యూటిఫుల్ మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘Rock On 2’. 2008లో విడుదలైన ‘Rock On’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫర్హాన్‌ అఖ్తర్‌, అర్జున్‌ రాంపాల్‌, పురబ్‌ కోహ్లీ, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. 2016లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నవంబర్‌ 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతూ మరో సారి మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. అసలు దీని కథ ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది ? తెలుగులో ఉందా ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

‘మ్యాజిక్‌’ అనే రాక్‌ బ్యాండ్‌లో ఆదిత్య శ్రాఫ్‌, జో మస్కరెనాస్‌, కేదార్‌ జవేరి మంచి స్నేహితులు. ఒకప్పుడు తమ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ ముగ్గురూ కొన్ని చేదు అనుభవాల కారణంగా విడిపోతారు. ఆదిత్య ముంబైని వదిలి మేఘాలయలోని ఒక చిన్న ప్రాంతానికి వెళ్లిపోతాడు. అక్కడ రైతుల కోసం సహకార సంఘాన్ని నడుపుతూ, చిన్న పాఠశాలను కూడా నిర్వహిస్తుంటాడు. సంగీతానికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు.

Advertisement

మరోవైపు జో రియాలిటీ షో జడ్జిగా, క్లబ్‌ భాగస్వామిగా బిజీగా ఉంటాడు. కేదార్‌ కూడా మ్యూజిక్‌ ప్రపంచంలోనే కొనసాగుతుంటాడు. అయితే ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ అతడిని కలవడానికి మేఘాలయకు వస్తారు. ఆ సమయంలో పాత జ్ఞాపకాలు, గతంలో జరిగిన గొడవలు మళ్లీ తెరపైకి వస్తాయి. ముఖ్యంగా తమ మ్యూజిక్‌ లేబుల్‌ కారణంగా ఒక యువ కళాకారుడు ఆత్మహత్య చేసుకున్నాడనే అపరాధభావం ఆదిత్యను వెంటాడుతుంటుంది.

ఇదిలా ఉంటే.. ఆదిత్య నిర్వహిస్తున్న రైతుల సహకార సంఘంపై స్థానిక మార్కెట్‌ మాఫియా కక్ష పెంచుకుంటుంది. వారి పొలాలను తగలబెట్టి రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఈ విషాదం నుంచి గ్రామస్థులను బయటపడేయడానికి ఆదిత్య ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటాడు. అదే సమయంలో జియా శర్మ అనే సంగీత ప్రియురాలు అతడి జీవితంలోకి వస్తుంది. ఆమెకు సంగీతంపై మంచి పట్టున్నా, తన తండ్రి అభిప్రాయాల కారణంగా తన ప్రతిభను బయటపెట్టడానికి భయపడుతుంటుంది.

Advertisement

జియా పాటలు విన్న జో, కేదార్‌ ఆమెను తమ బ్యాండ్‌తో కలిసి పనిచేయమని ఆహ్వానిస్తారు. అలా పాత స్నేహితులు మళ్లీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతారు. గ్రామస్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు షిల్లాంగ్‌ సమీపంలో భారీ రాక్‌ కాన్సర్ట్‌ నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. కానీ జియా కుటుంబానికి సంబంధించిన గతం, ఆదిత్యను వెంటాడుతున్న అపరాధభావం, స్థానిక మాఫియా అడ్డంకులు ఈ ప్రయత్నానికి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి.

మరి ఈ స్నేహితులు తమ విభేదాలను పక్కనపెట్టి మళ్లీ ఒక్కటవుతారా? జియా తన సంగీత ప్రతిభను నిరూపించుకుంటుందా? గ్రామస్థులకు సహాయం చేయాలనే వారి ప్రయత్నం విజయవంతమవుతుందా? అన్నదే మిగతా కథ. మ్యూజిక్‌ లవర్స్‌తో పాటు ఎమోషనల్‌ డ్రామాలను ఇష్టపడేవారు చూడదగిన సినిమా ఇది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

ఇందులో ఆదిత్య శ్రాఫ్‌ పాత్రలో ఫర్హాన్‌ అఖ్తర్‌, జో మస్కరెనాస్‌గా అర్జున్‌ రాంపాల్‌, కేదార్‌ జవేరి పాత్రలో పురబ్‌ కోహ్లీ నటించారు. జియా శర్మగా శ్రద్ధా కపూర్‌, ఉడయ్‌గా శశాంక్‌ అరోరా, సాక్షిగా ప్రాచీ దేశాయ్‌, జియా తండ్రిగా కుముద్‌ మిశ్రా కనిపిస్తారు. శుజాత్‌ సౌదాగర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ సమకూర్చారు. 2016 నవంబర్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నిడివి సుమారు 2 గంటల 23 నిమిషాలు. ప్రస్తుతం Netflixలో హిందీ ఆడియో, ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం అందుబాటులో లేదు.

Read Also: అపార్ట్‌మెంట్‌లోని అందరికీ కోట్ల రూపాయల ఆఫర్‌… బిల్డర్‌ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రిటైర్డ్‌ టీచర్‌

Tags

Related News

ఉంగరం కోసం సౌరాన్‌ వేట… ఎల్వ్స్, ఓర్క్స్‌ మధ్య భీకర పోరు… ‘ది రింగ్స్ ఆఫ్ పవర్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

కొడుకు వింతగా ప్రవర్తిస్తున్నాడని టీచర్‌పై అనుమానం… స్కూలుకెళ్ళి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉన్న మిస్టరీ డ్రామా

రాణి శరీరంలోకి మగ చెఫ్‌ ఆత్మ… రాజభవనంలో వంటలతో పాటు రాజకీయాలు కూడా… కొరియన్‌ ఫాంటసీ కామెడీ డ్రామా

అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

Big Stories

Advertisement
×