Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. గత కొన్నేళ్లుగా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడటంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లో కూడా తన హవాని కొనసాగిస్తుంది. కుబేర చిత్రంలో రష్మిక పాత్రను అందరూ పొగిడేస్తున్నారు. రష్మిక, ధనుష్ కాంబో అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని, ఈ ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్ అని, రష్మిక అద్భుతంగా నటించారని అంతా పొగిడేస్తున్నారు.. నాగార్జున, శేఖర్ కమ్ముల కూడా పలు ఇంటర్వ్యూలలో ఇదే మాటను చెప్పారు. ఆమెపై ప్రశంసలు కురిపించారు. తాజాగా నటించిన కుబేర చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది.. ఈ క్రమంలో రష్మిక చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
‘కుబేర ‘ రష్మిక ఎమోషనల్ పోస్ట్..
శేఖర్ కమ్ముల చిత్రాల్లో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. హీరో పాత్రల్ని మల్చే తీరుకంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీదే శేఖర్ కమ్ముల ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అసలు శేఖర్ కమ్ముల సినిమాలు అనగానే హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా గుర్తుకు వస్తారు.. గతంలో ఈయన తెర్కెక్కించిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవికి ఎంత క్రేజ్ దక్కిందో అందరికీ తెలుసు.. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన కుబేర సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో తమిళ హీరో ధనుష్, నాగార్జున, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు.. ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రష్మిక మందన్న ఎమోషనల్ పోస్టు ను షేర్ చేసింది.
రష్మిక మందన్న నటనపై నాగార్జున, శేఖర్ కమ్ముల పొగడ్తల వర్షం కురిపించారు. మాటలు ఆమె వరకు చేరాయి. అయితే తాజాగా ఆమె స్పందించింది. ఈ మాటలతో రష్మిక గుండె నిండిపోయింది. మనసు గాల్లో తేలిపోయింది. ఇదే.. దీని కోసమే కదా? మేం ఇంత కష్టపడేది.. వీళ్ల మాటలతో నా మనసు నిండిపోయింది.. సంతోషంతో మనసు ఉప్పొంగిపోతోంది.. నేను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినట్టు అనిపిస్తోంది.. నేను ఎంతో ఆరాధించే నాగ్ సర్, శేఖర్ కమ్ముల సర్ నన్ను చూసి గర్వపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ మనసు దోచుకుంటుంది అని ఆమె పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?
‘కుబేర’ మూవీ పై నెటిజన్స్ రియాక్షన్..?
కుబేర మూవీ నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. పైగా ఇది సినిమాలకే కొత్త సినిమా అంటూ శేఖర్ కమ్ముల చెప్పిన మాటలు మరింత ఆసక్తిని పెంచేశాయి. మరి ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే ట్విట్టర్‌లో టాక్ బయటకు వచ్చేసింది.. ఈ సినిమా ఫస్ట్ అఫ్ చాలా బాగుందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ధనుష్ నటన ఓ రేంజ్ లో ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. కాస్త సినిమా లెంత్ గా ఉన్నా కూడా. డైరెక్టర్ ఏది చూపించాలనుకున్నారో అది చూపించారు అంటూ శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ అయితే మొదటి షో తో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఇక కలెక్షన్లు ఎలా ఉంటాయో సాయంత్రంలోపు తెలిసే అవకాశం ఉంది..
This is everything I work for..
This just makes everything so worth it.🩷
Fills my heart with so much joy when I see my director and Nag sir who I adore and look up to so much- proud of me..🩷
Shekar sir and Nag sir -I hope to always have your blessings 🩷
Our film is releasing… https://t.co/ebShQhgw5B— Rashmika Mandanna (@iamRashmika) June 19, 2025