OTT Movie : మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఒక తమిళ్ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ తమిళ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
జీ 5 (Zee 5) లో
ఈ తమిళ కామెడీ మూవీ పేరు ‘కుటుంబస్థాన్’ (Kudumbasthan). 2025 లో వచ్చిన ఈ మూవీకి రాజేశ్వర్ కాళీసామి దర్శకత్వం వాహంచారు. ఇందులో కె. మణికందన్, సాన్వే మేఘన ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్. సుందర్‌రాజన్, గురు సోమసుందరం, కుదస్సనాద్ కనకం, నివేద రాజప్పన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కుటుంబస్థాన్ ‘ 2025 జనవరి 24 న థియేటర్లలో విడుదలై, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ కి ఎక్కింది. ఈ స్టోరీ నవీన్ అనే మధ్యతరగతి యువకుడి జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈమూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
నవీన్ అనే ఒక మధ్యతరగతి యువకుడు, వెన్నిలా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వీళ్ళ కులాలు వేరు కావడంతో ఈ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరు. అయినప్పటికీ వారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని, కోయంబత్తూరులో నవీన్ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తారు. నవీన్ ఒక్కడే అతని కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది. ఆయితే అతని తల్లి వెన్నిలాను ఆమె కులం కారణంగా సూటి పోటీ మాటలు అంటుంది. అతని తండ్రి కొత్త ఖర్చుల గురించి ఎప్పుడూ నవీన్ కు చెబుతూ ఉంటాడు.
ఇదిలా ఉంటే వెన్నిలా గర్భవతి కావడంతో వారి జీవితంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఒక రోజు నవీన్ తన కంపెనీలో ఒక కొలీగ్ తో గొడవపడతాడు. అతని తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో ఉద్యోగం కోల్పోతాడు. ఇది అతని జీవితంలో మరింత ఆర్థిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. కుటుంబ ఖర్చులు, అప్పుల ఒత్తిడితో నవీన్ ఇబ్బందులు పడతాడు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచి పెడతాడు.
Read Also : వందేళ్ల వయసులో భార్యమీద అనుమానం… విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే వృద్ధుడు… ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
తరువాత ఇంట్లో తెలిసిస్ అతనితో ఒక బేకరీ వ్యాపారం స్టార్ట్ చేయిస్తారు. కానీ పోటీ కారణంగా అది అంతగా నడవకపోవడంతో మరిన్ని కష్టాలు వస్తాయి. కొండన్ని అప్పులు మరింత పెరుగుతాయి. మరోవైపు వెన్నిలా UPSC ప్రిలిమ్స్ క్లియర్ చేస్తుంది. నవీన్ పడుతున్న ఇబ్బందులను చూసి వెన్నిలా అతని మాజీ బాస్ మోహన్ రామ్ ను కలసి ఉద్యోగాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది. అయితే ఈ విషయం నవీన్ కు తెలిసి అతని ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఈ దంపతుల మధ్య వాదన జరుగుతుంది. వెన్నిలా ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా ? అని బాధపడుతుంది. చివరికి నవీన్ కష్టాలు తీరుతాయా ? భార్య, భర్తలు సంతోషంగా ఉంటారా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకండా చూడండి.