E-Paper
Advertisement

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్
Advertisement

Tamil Crime Thriller: ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం కథ ముగిసిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లలో ముందు వరుసలో ఉంటుంది ‘కుట్రమ్ పురింధవన్ ది గిల్టీ వన్ (Kuttram Purindhavan The Guilty One). ఒక మంచి మనిషి పరిస్థితుల కారణంగా తీసుకున్న ఒక్క తప్పు నిర్ణయం అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందో చెప్పే ఎమోషనల్ సైకలాజికల్ డ్రామా ఇది. ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠను పెంచుతూ, నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఆసక్తిని కలిగించేలా కథ సాగుతుంది. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

భాస్కర్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఫార్మసిస్ట్ చుట్టూ ఈ సిరీస్ కథ నడుస్తుంది. భార్యతో కలిసి ఆయన ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతని జీవితంలో ఒకే ఒక ఆశ ఉంటుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన మనవడికి అవసరమైన శస్త్రచికిత్స చేయించడమే ఆ ఆశ. అందుకోసం రావాల్సిన రిటైర్మెంట్ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ ఆ డబ్బులు అందాలంటే తనపై ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు. ఇదే తర్వాత అతని జీవితంలో అతిపెద్ద పరీక్షగా మారుతుంది.

Advertisement

అంతా బాగుంది అనుకుంటుండగా, ఒకే ఒక్క రాత్రిలో అన్నీ మారిపోతాయి. ఆరోజు ఊర్లో జాతర జరుగుతుంది. అదే రోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న స్టీఫెన్ అనే వ్యక్తి తన చిన్నారి కూతురు మెర్సీని తీసుకుని భాస్కర్ ఇంటికి వస్తాడు. చిన్నారిని కాపాడమని వేడుకుంటాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే బయట అనూహ్యమైన ఘటన జరుగుతుంది. లోపలికి వెళ్లి చూసిన భాస్కర్‌కు మరో షాక్ ఎదురవుతుంది. ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటుంది. ఆమె శరీరంపై కనిపించే కొన్ని ఆనవాళ్లు ఈ ఘటన వెనుక మరింత భయంకరమైన నిజం దాగి ఉందనే అనుమానాన్ని కలిగిస్తాయి.

ఆ క్షణంలో భాస్కర్ తీసుకున్న ఒక నిర్ణయం… కథను ఊహించని మలుపు తిప్పుతుంది. ఒకవైపు తన మనవడి భవిష్యత్తు, మరోవైపు చట్టం అనే భయం. ఈ రెండింటి మధ్య భాస్కర్ నలిగిపోతుంటాడు. ఇదే సమయంలో మెర్సీ కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు కంప్లయింట్ చేస్తుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యత గౌతమ్ అనే కానిస్టేబుల్ చేతికి వస్తుంది.

Advertisement

మొదట రొటీన్ మిస్సింగ్ కేసులా కనిపించిన ఈ ఘటన, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ఆధారాలు బయటపడుతూ అసలు నిజానికి ప్రేక్షకుడిని మరింత చేరువ చేస్తాయి. ఇంతకీ చివరికి ఏమైంది? అసలు మెర్సీకి ఏం జరిగింది? భాస్కర్ తీసుకున్న నిర్ణయం అతన్ని ఎలా చిక్కుల్లో పడేసింది ? గౌతమ్ అసలు నిజాన్ని బయట పెట్టాడా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను తప్పకుండా చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్ 

‘కుట్రమ్ పురింధవన్ ది గిల్టీ వన్’ సిరీస్ SonyLIVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ మిస్టరీ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి బెస్ట్ ఆప్షన్. 7 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ఓటీటీలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఉంది. కథలో భావోద్వేగం ఉండాలి, ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠ కలిగించాలి, చివరి వరకు ఏం జరుగుతుందో ఊహించలేని మిస్టరీ కావాలి అనుకునేవారికి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది.

Read Also: అపరిచితుడితో జంప్ అవ్వాలనుకునే అమ్మాయి… తమిళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Tags

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×