OTT Movie : కొన్ని సినిమాలు స్త్రీల వెనకబాటుతనాన్ని చూపించడంతో పాటు మంచి మెస్సేజ్ కూడా ఇస్తాయి. అటువంటి సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కామెడీతో ఎంటర్టైన్ చేస్తూ, స్త్రీల వెనకబాటు గురించి కూడా ఆలోచింప జేసే విధంగా ఉంటుంది. ఆడవాళ్ళు ముసుగు ధరించే ఆచారం గురించి ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ మూవీ పేరు ‘లాపత్తా లేడీస్’ (Laapataa Ladies). 2023 లో విడుదలైన ఈ కామెడీ డ్రామా మూవీకి కిరణ్ రావు దర్శకత్వం వహించారు. దీనిని ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్‌పాండే కలసి నిర్మించారు. ఈ మూవీలో నితాన్షి గోయల్, ప్రతిభా రంటా, స్పర్శ్ శ్రీవాస్తవ్, ఛాయా కదమ్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2001 సంవత్సరంలో గ్రామీణ భారతదేశంలో జరిగిన కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఈ సినిమా స్టోరీ నవ వధువులైన ఫూల్, జయ చుట్టూ తిరుగుతుంది. ఈ కామెడీ డ్రామా మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక గ్రామీణ వాతావరణంలో సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. ఆతరువాత నవ వధువులైన ఫూల్, జయ వీరిద్దరూ తమ భర్తలతో రైలులో ప్రయాణిస్తుండగా, అనుకోని పరిస్థితిలో వారు మారిపోతారు. ఈ గందరగోళం వెనుక కారణం, వారు ముఖానికి పొడవైన ముసుగును ధరించడం వల్ల జరుగుతుంది. ఫూల్ అనే అమ్మాయి తన భర్త దీపక్ తో రైలు నుండి దిగాల్సి ఉండగా, ఆమె అక్కడ తప్పిపోతుంది. ఆమె ఒంటరిగా రైల్వే స్టేషన్‌లో చిక్కుకుంటుంది. అక్కడ ఆమె మంజు మాయి అనే టీ అమ్మే మహిళను కలుస్తుంది. మంజు మాయి ఆమెకు ఆశ్రయం ఇస్తుంది. జీవితంలో స్వతంత్రంగా ఉండడం గురించి ఆమెకు మోటివేషన్ ఇస్తుంది. ఫూల్ ఇక్కడ ఆమె మాటలకు బాగా అట్రాక్ట్ అవుతుంది.
ఇదే సమయంలో, దీపక్ తన భార్య అని భావించి జయను తన ఇంటికి తీసుకెళ్తాడు. జయ తనకు వివాహమైన వ్యక్తి ప్రదీప్ కాదని తెలుసుకుని, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఆమె తన చదువును మళ్ళీ కొనసాగించాలి అనుకుంటుంది. ఈ ఇద్దరు స్త్రీలు తమ జీవితాల్లో ఎదుర్కొనే సవాళ్లతో స్టోరీ ముందుకు వెళ్తుంది. దీపక్ తన నిజమైన భార్య ఫూల్‌ను వెతకడం మొదలుపెడతాడు. అదే సమయంలో జయ స్వేచ్ఛ కోసం పోరాడటం వంటి సన్నివేశాలు నవ్వుతెప్పిస్తూనే, భావోద్వేగాలతో నిండి ఉంటాయి. ఈ మూవీ కామెడిగా ఉన్నప్పటికీ, స్త్రీల విద్య, సాంప్రదాయ ఆచారాల గురించి ఆలోచనలో పడేస్తుంది. ఆడవాళ్ళు ముసుగు దరించడం, అణచివేసే సాంప్రదాయాలను చెప్పకనే చెప్తుంది. చివరికి ఫూల్, జయ ఇద్దరూ తమ మూసుగులను తీసివేసి స్వేచ్చ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ కామెడీ డ్రామా మూవీని మీరుకూడా చూడాలి అనుకుంటే, నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.