CSK VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే ఈ టోర్నమెంటులో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా.. రాయల్ చాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎనిమిదవ మ్యాచ్ కొనసాగుతోంది. అయితే ఇందులో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ చాలెంజ్ బెంగుళూరు మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది.
Also Read: CSK vs RCB: RCB రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై.. 24 గంటల్లోనే!
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో… భారీ స్కోర్ చేయలేకపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. చెన్నై కాస్త లూస్ బౌలింగ్ వేస్తే… 250 కి పైగా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు స్కోర్ చేసేది. ఇక రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఓపెనర్ సాల్ట్ 16 బంతుల్లో 32 పరుగులు చేశారు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. 200 స్ట్రైక్ రేటుతో రఫ్ ఆడించాడు సాల్ట్. అటు డేంజర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. ఎక్కువ బంతులు తిని తక్కువ రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ. టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడాడు. దేవదత్ పడిక్కల్ 14 బంతుల్లో 27 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదర్ 32 బంతుల్లో 51 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి.
Also Read: Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !
159 స్ట్రైక్రేట్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ( Royal Challengers Bangalore captain ) రెచ్చిపోయాడు. అటు డేంజర్ ఆల్ రౌండర్ లివింగ్స్టన్ మరో సారి దారుణంగా విఫలమయ్యాడు. 9 బంతుల్లో పది పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. జితేష్ శర్మ ( Jitesh Sharma ) ఆరు బంతుల్లో 12 పరుగులు చేశాడు. టీమ్ డేవిడ్ (Tim David ) 8 బంతుల్లో 22 పరుగులు చేసి.. దుమ్ము లేపాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు ఒక బౌండరీ కూడా ఉంది. అటు చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (Noor Ahmad ) మూడు వికెట్లు తీయగా…. మతిషా పతిరన రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీయగా అశ్విన్ ఒక వికెట్ తీశాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో.. 197 పరుగులు చేస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై… చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings ) విజయం సాధిస్తుంది.