OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకి మన ప్రేక్షకులు ఫిదా అవుతారు. ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ మూవీ లవర్స్ ని కుర్చీలకు కట్టిపడేస్థాయి. హీస్ట్ స్టోరీలతో వచ్చే యాక్షన్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. యాక్షన్ తో అదరగొట్టే అటువంటి హీస్ట్ స్టోరీ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లిఫ్ట్‘ (lift). 2024లో విడుదలైన ఈ అమెరికన్ హీస్ట్ కామెడీ మూవీకి ఎఫ్. గ్యారీ గ్రే దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కెవిన్ హార్ట్, గుగు మ్బాతా-రా, విన్సెంట్ డి’ఒనోఫ్రియో, ఉర్సులా కార్బెరో, బిల్లీ మాగ్నస్సేన్, జాకబ్ బాటలోన్, సామ్ వర్తింగ్టన్ నటించారు. ప్యాసింజర్ ఫ్లైట్‌లో అర బిలియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీని దొంగిలించడానికి, ఇంటర్‌పోల్ ఏజెంట్‌తో జట్టుకట్టిన అంతర్జాతీయ దొంగ అతని సిబ్బంది చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ అంతర్జాతీయ దొంగగా హిట్ లిస్ట్ లో ఉంటాడు. హీరోయిన్ ఇంటర్పోల్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఇద్దరికీ ఒక వెకేషన్ లో పరిచయం కూడా అవుతుంది. అయితే వీళ్ళిద్దరూ తమ ప్రొఫెషన్ గురించి దాచిపెడతారు. ఆ తర్వాత హీరో ఒక ఖరీదైన ఆర్ట్ ను చాలా తెలివిగా దొంగలిస్తాడు. ఆ దొంగతనం హీరోయిన్ కళ్ళముందరే జరుగుతుంది. ఇదివరకే పరిచయం ఉన్న అతను దొంగ అని తెలిసి హీరోయిన్ ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఒక స్మగ్లర్ భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఆ గోల్డ్ ను అతనికి దక్కకుండా చేయాలని, ఇంటర్‌పోల్ ఆఫీసర్ హీరోయిన్ కి చెప్తాడు. అలా చేయాలంటే నువ్వు, దొంగగా పేరు తెచ్చుకున్న హీరో హెల్ప్ తీసుకోవాలని చెప్తాడు. అలా హీరో హెల్ప్ తీసుకోవాలని అతని దగ్గరికి వస్తుంది హీరోయిన్.
మొదట హీరో అందుకు ఒప్పుకోకపోవడంతో, నువ్వు చేసిన దొంగతనానికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారని హీరోయిన్ చెప్పడంతో, ఆ తరువాత హీరో ఆమె చెప్పిన పనికి ఒప్పుకుంటాడు. ఏరోప్లేన్ లో స్మగ్లర్ భారీగా గోల్డ్ ను తరలిస్తుంటాడు. అందులో హీరో, హీరోయిన్లు కూడా ఉంటారు. విలన్ కి విషయం తెలిసి వాళ్ళిద్దరిపై అటాక్ చేస్తాడు. ఈ క్రమంలో అధికారులు ఏరోప్లేన్ ను పేల్చాలనుకుంటారు. చివరికి హీరో గోల్డ్ ని స్మగ్లింగ్ చేయకుండా ఆపుతాడా? విలన్ ని హీరో, హీరోయిన్ లు పోలీసులకు అప్పగిస్తారా? ఏరోప్లేన్ ని అధికారులు పేల్చేస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లిఫ్ట్’ (Lift) అనే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.