Tamannaah Bhatia: మామూలుగా సినీ పరిశ్రమలో డేటింగ్ అంటూ ప్రేమను మొదలుపెట్టి.. దానిని పెళ్లి వరకు తీసుకెళ్లే నటీనటులు చాలా తక్కువ. గత కొంతకాలంగా చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ అదే సంఖ్యలో బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంటల్లో తమన్నా, విజయ్ వర్మ కూడా ఒకరు. బాలీవుడ్‌లో తరువాత పెళ్లికి సిద్ధంగా ఉన్న జంటల్లో మొదటి పేరు వీరిదే ఉంటుంది. అలాంటిది తాజాగా తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక స్టోరీ చూస్తుంటే విజయ్ వర్మతో బ్రేకప్‌పై హింట్ ఇస్తుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.
అప్పటినుండి ప్రేమలో
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్లు అయిపోయింది. కానీ అప్పటినుండి ఇప్పటివరకు తన రిలేషన్‌షిప్ గురించి పెద్దగా రూమర్స్ ఏమీ రాలేదు. అలాంటి తమన్నా.. అప్‌కమింగ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. నటుడిగా విజయ్ వర్మ (Vijay Varma)కు ఉన్న అనుభవం చాలా తక్కువ. వీరిద్దరూ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్‌లో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2023 జూన్‌లో తమ ప్రేమ విషయాన్ని ఓపెన్‌గా అనౌన్స్ చేసేసింది తమన్నా. అప్పటినుండి అంతా సాఫీగా సాగిపోతున్నా తాజాగా తమన్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూస్తుంటే ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
ఎవరికి కౌంటర్.?
‘ప్రేమించబడడానికి సీక్రెట్ ప్రేమించడం. ఇంట్రెస్టింగ్‌గా అనిపించడానికి సీక్రెట్ ఇంట్రెస్ట్ చూపించడం. ఒకరు మిమ్మల్ని అందంగా చూడాలంటే ముందు మీరు వేరేవాళ్లను అందంగా చూడాలి. ఒకరు ఫ్రెండ్‌గా కావాలంటే ముందు మంచి ఫ్రెండ్‌గా ఉండాలి’ అంటూ ఒక కొటేషన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది తమన్నా. ఈ కోట్‌ను చూస్తుంటే ఎవరికో ఇన్‌డైరెక్ట్ కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉందే అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. వెంటనే ఇది విజయ్ వర్మను ఉద్దేశించి షేర్ చేసిన స్టోరీ అని ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ప్రస్తుతం విజయ్, తమన్నాలకు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమకు బ్రేకప్ అవ్వడం అనేది అంత ఈజీ కాదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అసలు సంతోషం అదే.. రౌడీ హీరోతో డేటింగ్ పై రష్మిక కామెంట్స్..!
ఇద్దరూ బిజీ
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తమన్నా (Tamannaah) హీరోయిన్‌గా కంటే గెస్ట్ రోల్స్, ఐటెమ్ సాంగ్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ మూవీ ‘స్త్రీ 2’లో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ అనే పాట బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మరోసారి తను ఫామ్ కోల్పోలేదు అని ప్రేక్షకులకు నిరూపించేలా చేసింది. విజయ్ వర్మ కూడా బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు వెండితెరపై విజయ్ నటించిన సినిమాలు చాలా తక్కువ సంఖ్యలో విడుదలయ్యాయి. తనను ఒక నటుడిగా నిలబెట్టింది ఓటీటీ చిత్రాలే. అలా ప్రస్తుతం విజయ్ చేతిలో దాదాపు అరడజనకు పైగా ఓటీటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో బ్రేకప్ రూమర్స్‌పై వీరు ఎలా స్పందిస్తారా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది.