Police vs TTE : టికెట్ లేకుండా రైలు ఎక్కితే ఎప్పుడెప్పుడు టికెట్ కలెక్టర్ వస్తారా? పట్టుకుంటే ఏం చేస్తాడా? అని వైపు భయం లాగేస్తుంటుంది. హడావుడిగా ఎక్కామన్నా, అనుకోకుండా ఎక్కేసేమన్నా.. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇండియన్ రైల్వేలో ఎక్కిన ఓ పోలీస్ అధికారికి ఎదురైంది. పోలీసు యూనిఫాంలో ఉన్నాననే ధైర్యమో, అతన్ని ఎవరు ఏమీ అనరనే ఆలోచనో కానీ.. నేరుగా వచ్చేసి స్లీపర్ క్లాస్ లోకి ఎక్కేశాడు. దర్జాగా సీటులో పడుకున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన ఓ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్-TTE అతనితో కాస్త గట్టిగానే వ్యవహరించాడు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే… తనకు నార్మల్ వ్యక్తి అయినా, యూనిఫాంలోని పోలీసు అధికారి అయినా ఒకటే అని కరాఖండీగా చెప్పేసాడు. చెప్పడమే కాదు.. చేసి చూపించాడు కూడా. అంతేకాదు ఉన్న పాటుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనని హుకుం జారీ చేసేసాడు.
సాధారణంగా చాలామంది పోలీస్ అధికారులు, ఇతర సర్వీస్ ల్లోని వ్యక్తులు ఐడీ కార్డులు పట్టుకును, యూనిఫామ్ లలో ట్రైన్లల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అదేమంటే గవర్నమెంట్ పని మీద వెళ్తున్నామని చెబుతుంటారు. ఇలాంటి వారి విషయంలో చాలామంది టీటీఈలు చూసి చూడనట్టే వ్యవహరిస్తుంటారు. కానీ ఓ టీటీఈ మాత్రం అందుకు భిన్నంగానే చేశాడు. తనకు ఎవరైనా ఒకటే అన్నట్లుగా వ్యవహరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అనేక మంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అతను చేసిన పనికి సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
రైలులో అందరి టికెట్లు పరిశీలిస్తూ వస్తున్న ఓ టీటీఈ ఏసీ స్లీపర్ కోచ్ లోని ఓ సీట్లో దర్జాగా పడుకున్న పోలీసు అధికారి ఎదురయ్యాడు. అతని దగ్గర ఎలాంటి టికెట్ లేదు. కనీసం జనరల్ టికెట్ కూడా లేకుండానే రైలు ఎక్కేశాడు. అంతే టీటీఈకి ఎక్కడ లేని చిరాకు తన్నుకొచ్చింది. యూనిఫాంలో ఉన్న వారి టికెట్లు తనిఖీ చేయరని అనుకుంటున్నారా? కనీసం జనరల్ టికెట్ కూడా లేకుండా ఏసీ కోచ్ లోకి ఎలా వచ్చారు? అంటూ టీటీఈ విరుచుకుపడ్డాడు. తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించాడు. టీటీఈ వ్యవహారంతో బిత్తరపోయిన పోలీసు అధికారి నెమ్మదిగా తన వస్తువుల్ని సర్దుకుని అక్కడి నుంచి జారుకుంటున్నాడు.
ఆ పోలీసు వ్యక్తి అక్కడి నుంచి వెళ్లి మరోచోట తిష్ట వేస్తాడని అనుకున్నాడో, ఏమో కానీ.. ఏసీ కోచ్ లో కాదు, మీరు జనరల్ కంపార్ట్మెంట్లో కనిపించాలి. లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చేసాడు. దీంతో రైల్వేలో అసలు బాస్ అంటే ఎవరో టీటీఈ చూపించాడు అంటూ నెెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలా చాలామంది పోలీస్ అధికారులను అతను చేసి ఉంటారు.. అందుకే అంత కోపం వచ్చింది అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు. ఇదేమైనా మొత్తంగా టీటీఈ కే నెటిజన్ల మద్ధతు లభించింది.
మరికొందరైతే.. రైల్వేలకు విమానాశ్రయాల లాంటి వ్యవస్థలు ఉండాలని అభిప్రాయపడ్డారు. కేవలం చెల్లుబాటు అయ్యే రిజర్వు టికెట్లు ఉన్న వారికి మాత్రమే రైలు ఎక్కేందుకు స్టేషన్ లోకి అనుమతించాలంటున్నారు. స్థానిక రైళ్లు, మెమొలు, ఈఎంయు రైళ్లకు ప్రత్యేక ప్లాట్ ఫామ్ లు కేటాయించాలని, సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు వేరుగా ప్లాట్ ఫారంలు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇలా… ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ లో ఒకటిగా మారిపోయింది.