BigTV English

OTT Movie: ఇంటి దొంగని ఈశ్వరుడే పడతాడా ? సీరియల్ కిల్లర్ కన్నా ఆమె మొగుడే డేంజర్..

OTT Movie: ఇంటి దొంగని ఈశ్వరుడే పడతాడా ? సీరియల్ కిల్లర్ కన్నా ఆమె మొగుడే డేంజర్..

OTT Movie : బెంగాల్ ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు తెరకెక్కుతున్నాయి. మలయాళం సినిమాల తరువాత, ఈ సినిమాలకు ఫాలోయింగ్ పెరుగుతోంది. వెబ్ సిరీస్ లు కూడా పోటీగా వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ సిరీస్ మహిళలు ఇంటిలో ఎదుర్కునే సమస్యల చుట్టూ తిరుగుతుంది. కొంతమంది భర్తలు భార్యలను శారీరకంగా హింసించకపోయినా, వాళ్ళు ఇబ్బంది పెట్టే తీరు సైకోలకన్నా దారుణంగా ఉంటుంది. ఇదే కంటెంట్ తో ఓటీటీలలో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Lojja’ 2024లో విడుదలైన బెంగాలీ సోషల్ డ్రామా వెబ్ సిరీస్. దీన్ని అదితి రాయ్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ప్రియాంక సర్కార్, అనుజోయ్ చటోపాధ్యాయ్, సావోలి చటోపాధ్యాయ్, అనిందిత బోస్, దీపాంకర్ దే ముఖ్య పాత్రల్లో నటించారు. Hoichoiలో 2024 మార్చి 22 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది, రెండో సీజన్ 2025 ఏప్రిల్ 11 నుంచి విడుదలైంది. Prime Video, Airtel Xstreamలో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. సీజన్ 1లో 5 ఎపిసోడ్స్, సీజన్ 2లో 3 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ కేక పెట్టిస్తోంది. సీజన్ 1 కి IMDbలో 6.6/10, సీజన్ 2 కి 7.0/10 రేటింగ్ ను కలిగి ఉంది.


సీజన్ 1 స్టోరీ

జయా (ప్రియాంక సర్కార్) ఒక సాధారణ గృహిణి, భర్త పార్థ (అనుజోయ్ చటోపాధ్యాయ్)తో కలసి జీవిస్తుంటుంది. కానీ పార్థ ఆమెను మాటలతో అబ్యూస్ చేస్తుంటాడు. ఆమెను అందరిముందూ ఇంట్లో అవమానిస్తాడు. ఈ బాధలు జయా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఆమె మానసికంగా కుంగిపోతుంది. ఆమె సమాజంలో మహిళలపై ఉండే డొమినేషన్‌తో పోరాడుతూ తన గౌరవాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. ఆమె సహోద్యోగి మౌ (సావోలి చటోపాధ్యాయ్) వంటి స్నేహితులు, కొంతమంది ప్రొఫెషనల్స్ సహాయంతో జయా తన బాధలను అధిగమించి, పార్థను చట్టపరంగా ఎదుర్కొంటుంది. ఈ కోర్ట్‌రూమ్ డ్రామాలో ఇంద్రాసిష్ రాయ్ వంటి గొప్ప లాయర్లు ఆమెకు తోడవుతారు. ఈ సీజన్ జయా ఎమోషనల్ జర్నీ, సమాజంలో మహిళలపై ఒత్తిడి, వెర్బల్ అబ్యూస్ ఎఫెక్ట్‌ని హైలైట్ చేస్తుంది.

సీజన్ 2 స్టోరీ:

సీజన్ 2లో జయా జీవితం మరింత క్రిటికల్ గా మారుతుంది. ఆమె డివోర్స్ ప్రక్రియలో ఉండగా, ఒక ట్రాజిక్ ఈవెంట్ జరుగుతుంది. ఆమె స్నేహితుడు శౌర్జ్య అనుమానస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. అందరూ జయా పై అనుమానం పడతారు. ఆమెకు సన్నిహితులు కూడా వ్యతిరేకంగా మారతారు. ఇక ఆమె ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఈ సీజన్ వెర్బల్ అబ్యూస్, మిస్‌కమ్యూనికేషన్, సమాజం తీరును ఎదుర్కొంటూ జయా తన గౌరవాన్ని తిరిగి పొందే ధైర్యవంతమైన ప్రయాణంపై దృష్టి పెడుతుంది. ఈ సీజన్‌ని మరింత ఇంటెన్స్ తో నడుస్తుంది. జయా ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడుతుంది ? ఆమె సింగిల్ గా ఉండటానికి ఇష్టపడుతుందా ? భర్తతో కలుస్తుందా ? సమాజం ఆమెను ఎలా ట్రీట్ చేస్తుంది ? అనే విషయాలను ఈ బెంగాలీ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : భయపడితే బలం పెంచుకునే దెయ్యం… సైకియాట్రిస్ట్ కి బతికుండగానే నరకం… ఉలిక్కిపడే సీన్స్ ఎన్నో

Related News

OTT Movie: పక్కింటి ఆంటీపై కోరిక.. చివరికి గుడిలో ఆమెతో అలాంటి పని.. కవ్విస్తూనే చివరికి కన్నీరు పెట్టించే మూవీ

OTT Web Series: ఈ 10 వెబ్ సీరిస్‌లు చూస్తే రాత్రంతా జాగారమే.. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి మామ!

OTT Movie : పార్టీ చేసుకుంటే వీడి చేతిలో చావే… జనాల్ని గడగడా వణికించే సీరియల్ కిల్లర్… నరాలు తెగే సస్పెన్స్

OTT Movie : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల చర్మాన్ని వలిచి అమ్ముకునే రాకెట్… వలపు వల వేసి ట్రాప్… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : డబ్బు కోసం అబ్బాయితో ఆ ఆట… ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే ఖతర్నాక్ కిలాడీ… ఊహించని క్లైమాక్స్

kantara Chapter 1 OTT: భారీ డీల్ కుదుర్చుకున్న కాంతార 2.. ఎన్ని కోట్లో తెలుసా?

OTT Movie : శవాన్ని దాచడానికి మాస్టర్ ప్లాన్… చెఫ్‌తో పెట్టుకుంటే ఇదే గతి… గ్రిప్పింగ్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×