BigTV English
Advertisement

India’s Most-Watched OTT Series of 2025: ఓటీటీలో గత్తర లేపుతున్న సిరీస్… 2025లోనే మోస్ట్ వాచ్డ్ గా రికార్డు… స్ట్రీమింగ్ ఎక్కడంటే

India’s Most-Watched OTT Series of 2025: ఓటీటీలో గత్తర లేపుతున్న సిరీస్… 2025లోనే మోస్ట్ వాచ్డ్ గా రికార్డు… స్ట్రీమింగ్ ఎక్కడంటే

India’s Most-Watched OTT Show of 2025 : 2025 సంవత్సరం ఇండియన్ OTT ప్లాట్‌ఫామ్‌లలో వెబ్ సిరీస్ లకు గట్టి పోటీ నడిచింది. “Criminal Justice: A Family Matter” సిరీస్ 2025 మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా చూసిన డిజిటల్ సిరీస్‌గా నిలిచింది. ఒర్మాక్స్ మీడియా డేటా ప్రకారం, ఇప్పటిదాకా ఈ లీగల్ డ్రామా నాల్గవ సీజన్‌ని 27.7 మిలియన్ మంది చూశారు. ఇది “ఏక్ బద్‌నామ్ ఆశ్రమ్”, “పంచాయత్”, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన “స్క్విడ్ గేమ్ సీజన్ 3” వంటి భారీ బడ్జెట్ షోలను మించిన రికార్డు కావడం విశేషం. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ 2025 మొదటి ఆరు నెలల్లో ఇండియన్ OTT ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానంలో నిలిచింది.


అంతర్జాతీయ నిర్మాణ విలువలతో కూడిన షోలతో పోలిస్తే, ఈ కోర్ట్‌రూమ్ డ్రామా… కుటుంబ బంధాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సీజన్ విజయం వెనుక ప్రధాన కారణం పంకజ్ త్రిపాఠీ. ఇతను తెలివైన, సానుభూతి ఉన్న లాయర్ మాధవ్ మిశ్రాగా మళ్లీ కనిపించాడు. మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్, సుర్వీన్ చావ్లా, ఆశా నేగి, ఖుష్బూ అత్రే వంటి నటీనటులు కూడా ఈ కథను మరింత ఆకట్టుకునేలా చేశారు. ఈ సీజన్ 2025 మే 29న ప్రీమియర్ అయింది. సిరీస్ కథ, రియలిస్టిక్ ప్రెజెంటేషన్, ఎమోషనల్ డెప్త్‌ తో ప్రశంసలు అందుకోవడమే కాదు “Criminal Justice” ఫ్రాంచైజీకి ఇది ఒక ట్రేడ్‌మార్క్‌గా నిలిచింది.

2025లో ఇండియా టాప్ 10 ఓటీటీ షోలు


1 ‘క్రిమినల్ జస్టిస్ : ఏ ఫ్యామిలీ మేటర్’ (Criminal Justice: A Family Matter)
జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ లీగల్ డ్రామా 27.7 మిలియన్ వ్యూస్ తో అగ్ర స్థానంలో నిలిచింది.

2. ‘ఏక్ బద్‌నామ్ ఆశ్రమ్ సీజన్ 3’ (Ek Badnaam Aashram Season 3)
ఇందులో బాబీ డియోల్ ఒక దొంగ బాబాగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సిరీస్‌ 27.1 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

‘పంచాయత్ సీజన్ 4’ (Panchayat Season 4) : 23.8 మిలియన్ వ్యూస్
జితేంద్ర కుమార్ నటించిన ఈ కామెడీ డ్రామా ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

‘పాతాళ్ లోక్ సీజన్ 2’ (Paatal Lok Season 2): 16.8 మిలియన్ వ్యూస్
జైదీప్ అహ్లావత్ నటనతో, క్రైమ్, రాజకీయాల గురించి ఒక బలమైన కథనంతో ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ అవుతోంది.

‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ (Squid Game Season 3): 16.5 మిలియన్ వ్యూస్
ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన ఈ కొరియన్ థ్రిల్లర్ ఇండియాలో లోకల్ షోలతో పోలిస్తే కొంచెం వెనుకబడింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6’ (The Legend of Hanuman Season 6): 16.2 మిలియన్ వ్యూస్
ఈ యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

‘ది రాయల్స్’ (The Royals): 15.5 మిలియన్ వ్యూస్
ధనవంతుల జీవితాలు, ద్రోహం గురించి చెప్పే ఈ డ్రామా మంచి ఆదరణ పొందింది. నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

‘ది సీక్రెట్ ఆఫ్ ది షీల్దార్స్’ (The Secret of the Shiledars): 14.5 మిలియన్ వీక్షకులు
ఈ మిస్టరీ థ్రిల్లర్ ఉత్కంఠభరిత కథ, గట్టి నరేషన్‌తో కేక పెట్టిస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

‘చిడియా ఉడ్’ (Chidiya Udd): 13.7 మిలియన్ వ్యూస్
హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చెప్పే ఈ సిరీస్ రియలిస్టిక్ నటనతో ఆకట్టుకుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

‘జ్యువెల్ థీఫ్’ (Jewel Thief): 13.1 మిలియన్ వ్యూస్
యాక్షన్, హీస్ట్ కథతో ఈ సిరీస్ టాప్ 10 లిస్ట్‌లో చోటు సంపాదించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : రీల్ కోసం రియల్ గా చంపే డైరెక్టర్ … ఒక్కో స్టైల్లో ఒక్కో ట్విస్టు… క్లైమాక్స్ లో పూనకాలే

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×