OTT Movie : ఇప్పుడు ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. వీటిలో సీరియల్ కిల్లింగ్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. అందులోనూ రియల్ లైఫ్ సంఘటనలతో వచ్చిన సినిమాలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక జంట దారుణంగా మహిళలను హత్యలు చేస్తుంటారు. ఈ సన్నివేశాలు చాలా ఘోరంగా ఉంటాయి. నిజజీవితంలో ఈ జంటను కరెంట్ షాక్ తో ఉరి కూడా తీశారు. ఈ హత్యలు 1940వ దశకంలో జరిగాయి. ఈ సంఘటనలతో తెరకెక్కిన సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలలోకి వెళితే
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘లోన్లీ హార్ట్స్’ (Lonely hearts). దీనికి టాడ్ రాబిన్సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1940వ దశకంలో అమెరికాలో జరిగిన నిజమైన “లోన్లీ హార్ట్స్ కిల్లర్స్” కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో జాన్ ట్రావోల్టా (డిటెక్టివ్ ఎల్మర్ సి. రాబిన్సన్‌గా), జేమ్స్ గాండోల్ఫిని (డిటెక్టివ్ చార్లెస్ హిల్డెబ్రాండ్ట్‌గా), జారెడ్ లెటో (రేమండ్ ఫెర్నాండెజ్‌గా), సల్మా హాయక్ (మార్థా బెక్‌గా), లారా డెర్న్ (రెనే ఫోడీగా) నటించారు. ఇది న్యూయార్క్ నుండి మిచిగాన్ వరకు జరిగిన ఒక హత్యల గొలుసును ఛేదించే డిటెక్టివ్‌ల చుట్టూ తిరుగుతుంది. IMDbలో ఈ సినిమాకి 6.4/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా Amazon Prime Video, Plexలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
1940వ దశకం చివరలో అమెరికాలో రేమండ్ ఫెర్నాండెజ్ అనే ఒక చార్మింగ్ కాన్‌మ్యాన్, ఒంటరిగా ఉండే డబ్బున్న మహిళలను మోసం చేస్తుంటాడు. అతను వాళ్ళతో పరిచయం పెంచుకుని, వారి దగ్గర ఉండే డబ్బు, విలువైన వస్తువులను దొంగిలిస్తుంటాడు. ఒక రోజు అతను మార్థా అనే మహిళను టార్గెట్ చేస్తాడు. కానీ వీళ్ళు కలిసినప్పుడు నిజమైన ప్రేమలో పడతారు. మార్థా కూడా రేమండ్ లాగా మోసాలు చేస్తూ జీవిస్తుంటుంది. ఇప్పుడు వారిద్దరి మధ్య ఒక విచిత్రమైన రొమాన్స్ మొదలవుతుంది. మార్థా, రేమండ్ సోదరిగా నటిస్తూ, అతనితో కలిసి ఈ మోసాలను కొనసాగిస్తుంది. వారు ఒంటరి ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకుని, వారి ఆస్తులను దొంగిలించడమే కాకుండా, వారిని క్రూరంగా హత్య చేస్తుంటారు. ఈ హత్యలు అత్యంత హింసాత్మకంగా ఉంటాయి. వీళ్ళు న్యూయార్క్ నుండి మిచిగాన్ వరకు ప్రయాణిస్తూ, దాదాపు 20 మంది మహిళలను చంపుకుంటూ పోతారు.
Read Also : ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ… నలుగురు అమ్మాయిల అరాచకం… ఇంత ఓపెన్ గా ఎలా చూపించారు భయ్యా