BigTV English

OTT Movie : పెళ్లి చూపుల్లో అవమానం… నెక్స్ట్ ట్విస్టుకు కాటేరమ్మ జాతర… హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : పెళ్లి చూపుల్లో అవమానం… నెక్స్ట్ ట్విస్టుకు కాటేరమ్మ జాతర… హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : రివేంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఒక హారర్ సినిమా ఓటీటీలలో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధారణంగా మొదలై, ఒక క్రూరమైన రక్తపాత రివేంజ్ థ్రిల్లర్ గా మారుతుంది. సిండ్రెల్లా అనే అందమైన అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఏ సినిమా పేరు ? ఏ ఓటీటీలలో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివారాల్లోకి వెళితే


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘సిండ్రెల్లాస్ కర్స్’ (Cinderella’s curse) 2024 లో వచ్చిన బ్రిటిష్ హారర్ సినిమా. దీనికి లూయిసా వారెన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రసిద్ధ సిండ్రెల్లా జానపద కథను ఆధారంగా చేసుకుని, దానికి ఒక భయంకరమైన, రక్తపాత ట్విస్ట్ జోడించి, స్టీఫెన్ కింగ్ క్యారీ సినిమా శైలిలో రూపొందింది. ఈ సినిమాలో కెల్లీ రియాన్ సాన్సన్ (సిండ్రెల్లాగా), క్రిస్సీ వున్నా (ఫెయిరీ గాడ్‌మదర్‌గా), డానియెల్ స్కాట్ (స్టెప్‌మదర్ లేడీ డయర్‌గా), లారెన్ బడ్ (ఇంగ్రిడ్‌గా), నటాషా టోసిని (హన్నాగా) నటించారు. ఇది 2024లో ITN స్టూడియోస్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా Tubi, Amazon Prime Video, Plexలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. దీనిని తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.


స్టోరీలోకి వెళితే

సిండ్రెల్లా ఒక అందమైన సాధారణ అమ్మాయి. తన శాడిస్ట్ సవతి తల్లి లేడీ డయర్, ఆమె పిల్లలు ఇంగ్రిడ్, హన్నా ఆధీనంలో బానిసలా జీవిస్తుంటుంది. ఆమె తండ్రి పట్టణంలో ఉన్నాడని ఆమె అందరికీ చెప్తూ ఉంటుంది. కానీ అతను బహుశా సవతి తల్లి చేతిలో చనిపోయి ఉండవచ్చు. వీళ్ళు సిండ్రెల్లాను రోజూ హింసించి, అవమానిస్తుంటారు. ఆమె జీవితం నరకంలా మారుతుంది. ఆమెను హౌస్‌మెయిడ్ ఆంజా, ఆమె కొడుకు మోరిట్జ్ సిండ్రెల్లా కాస్త ఆసరాగా ఉంటారు. సిండ్రెల్లా తన బాధలను ఒక డైరీలో రాసుకుంటుంది. ఇది ఆమెకు ఒక ఓదార్పుగా ఉంటుంది. ఒక రోజు రాజకుమారుడు లెవిన్ సవతి తల్లిని, ఆమె పిల్లలను ఒక స్వయంవరానికి ఆహ్వానించడానికి వస్తాడు. అక్కడ అతను తన భార్యను ఎన్నుకోవాలనుకుంటాడు. సిండ్రెల్లాను చూసిన లెవిన్ ఆమెను కూడా ఆహ్వానిస్తాడు. సిండ్రెల్లా అతనితో ప్రేమలో పడుతుంది. కానీ స్వయంవరం రోజున, సవతి తల్లి ఆమె దుస్తులను చించివేసి, ఆమెను ఇంట్లోనే ఉండమని ఆదేశిస్తుంది.

ఈ సమయంలో సిండ్రెల్లా ఒక పురాతన వస్తువును కనుగొంటుంది. ఇది ఒక ఫెయిరీ గాడ్‌మదర్ ను ఆవాహన చేస్తుంది. ఈ ఫెయిరీ గాడ్‌మదర్ ఒక భయంకరమైన రూపంలో ఉంటుంది. సిండ్రెల్లాకు మూడు కోరికలను ఇస్తానని చెబుతుంది. సిండ్రెల్లా మొదటి రెండు కోరికలను స్వయంవరానికి వెళ్లడానికి, అందంగా కనిపించడానికి ఉపయోగిస్తుంది. కానీ అక్కడ ఆమెకు ఒక భయంకరమైన అవమానం ఎదురవుతుంది. లెవిన్, ఇంగ్రిడ్, హన్నా కలిసి ఒక క్రూరమైన ప్రాంక్ చేస్తారు. లెవిన్ సిండ్రెల్లాను నడుము వరకు నగ్నంగా చేసి, ఆమె డైరీని బిగ్గరగా చదివి, ఆమెను అందరి ముందు అవమానిస్తాడు. సవతి తల్లి, ఆమె పిల్లలు ఆమెను కొట్టి, రక్తం కారేలా చేస్తారు.

Read Also : చెట్టుకు శవాలుగా వేలాడే అమ్మాయిలు… ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉండే క్రైమ్ థ్రిల్లర్

ఈ అవమానం సిండ్రెల్లాను పూర్తిగా బ్రేక్ చేస్తుంది. ఆమె తన మూడవ కోరికను ఉపయోగించి, తన సవతి తల్లి, సోదరీమణులు, లెవిన్, తనను అవమానించిన ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది. ఇక్కడ నుండి, సినిమా పూర్తిగా క్యారీ శైలిలో మారుతుంది. ఫెయిరీ గాడ్‌మదర్ సహాయంతో, సిండ్రెల్లా ఒక రక్తపాత కిల్లింగ్ ని మొదలెడుతుంది. ఆమె అందరినీ క్రూరంగా చంపుతుంది. ఒక సన్నివేశంలో ఆమె లెవిన్‌ గొంతులో కొవ్వొత్తి బలవంతంగా నెడుతుంది. ఇప్పుడు ఈ సినిమా ఒక స్లాషర్ ఫిల్మ్‌లా మారుతుంది. ఇక క్లైమాక్స్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? ఆమె తన సవతి తల్లిని కూడా చాపుతుందా ? సిండ్రెల్లా చివరికి ఏమవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×