Nindu Noorella Saavasam Serial Today Episode: ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడిన అమర్, మిస్సమ్మకు ఈవెంట్ మేనేజర్ థాంక్స్ చెప్తాడు. అందరూ వాళ్ల వాళ్ల ప్రాణాల కోసం పరుగెడుతుంటే.. వాళ్లు మాత్రమే పక్కవాళ్ల ప్రాణాల కోసం పరుగెత్తారు. ఫస్ట్ రౌండ్‌లో వాళ్ల పిల్లల గురించి మాట్లాడుకున్న తర్వాత వాళ్ల ప్రొఫైల్ చూసి ఒక్క రౌండ్ కూడా క్వాలిఫై కారేమో అనుకున్నాను. కానీ ప్రేమకు ఒకటి రెండు అనే నెంబర్స్‌తో పని లేదని మీరు ఫ్రూవ్ చేశారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్లనే కాదు. నా ఆలోచనలను కూడా ఓడించి మీరే గెలిచారు. నౌ ఐయామ్ ఫ్రౌడ్లీ అనౌన్స్ బెస్ట్ కపుల్ అమరేంద్ర గారు భాగుమతి గారు అంటూ అనౌన్స్ చేసి వాళ్లను స్టేజీ మీదకు పిలుస్తారు. అమర్, మిస్సమ్మ స్టేజీ మీదకు వెళ్తారు.
స్టేజీ మీదకు వెళ్లిన అమర్, మిస్సమ్మలను సన్మానించి చెక్, అవార్డు ఇస్తారు. అంతా చూస్తున్న చిత్ర అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. చిత్ర ఆగు అనుకుంటూ వినోద్ వెళ్తాడు. ఇద్దరూ కలిసి వెళ్లి ఒక దగ్గర రోడ్డు పక్కన నిలబడి చూస్తుంది చిత్ర. దీంతో వినోద్ ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉంటాము చిత్ర ఇంటికి వెళ్దాం పదా అంటాడు. చిత్ర కోపంగా వెళ్లి భాగీ, బావగారు గెలిచారని అందరూ చిందులు వేస్తూ విందులు చేసుకుంటుంటే.. మనం చూస్తూ ఉండాలా.? అరే ఏంటండి బావగారికి మీరంటే కొంచెం కూడా ప్రేమ లేదా..? మీ కోసం మిమ్మల్ని గెలిపించడం కోసమైనా ఆయన ఓడిపోవచ్చు కదా…? అంటుంది. దీంతో వినోద్ అదేంటి చిత్ర అలా మాట్లాడుతున్నావు అన్నయ్య గెలిచినా.. మనం గెలిచినా.. ఒక్కటే కదా అంటాడు.
దీంతో చిత్ర కోపంగా అవునా అయితే వెళ్లి మీ అన్నయ్య గెలిచిన చెక్ తీసుకురండి. తీసుకురాలేరు కదా..? మరి ఇలాంటి మాటలు మాట్లాడకండి.. నేనసలే ఒళ్లు మండిపోయి ఉన్నాను. బిజినెస్ చేస్తాం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు.. కాంపిటీషన్‌లో అయినా గెలుద్దం అంటే అక్కడ కూడా ఓడిస్తారు. అసలు మనం ఎలా బతకాలి. వినోద్ మనం ఇంటికి వెళ్లి వేరు కాపురం పెడదాం అని చెబుదాం. ఆస్థి బాగాలు పెట్టమని అడుగుదాం. మనం ఇప్పుడు నేరుగా వెళ్లి అంటూ ఏదో చెప్పబోతుంటే.. వినోద్ కోపంగా చిత్ర వేరు కాపురం అన్న ఆలోచన కూడా రానివ్వకు. ఎందుకంటే నేను అన్నయ్యను పిల్లలను వదిలి ఎక్కడిక రాను. అందరితో కలిసి ఉండటం.. అడ్జస్ట్ అవ్వడం నీకు అలవాటు ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చేసుకో ఎందుకంటే నేను నా ఫ్యామిలీ వదిలి ఎక్కడికి రాను.. అంటూ కారులోకి వెళ్లిపోతాడు వినోద్. చిత్ర కోపంగా నాకంటే నీకు నీ వాళ్లే ఎక్కువా వినోద్ అయితే చూస్తాను. వాళ్లంతట వాళ్లే ఆస్థి బాగాలు పంచి మనల్ని వేరు కాపురం పెట్టేలా చేస్తా అని మనసులో అనుకుంటుంది.
మరోవైపు అమర్, మిస్సమ్మ ఇంటికి వెళ్లగానే మనోహరి కంగారు పడుతూ వచ్చి డోర్ తీస్తుంది. హమ్మయ్య అమర్ వచ్చేశారా..? అంటుంది. దీంతో ఏమైంది మనోహరి ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అమర్ అడుగుతాడు. దీంతో కంగారేం లేదు అమర్ అని మను చెప్తుంది. ఏమీ లేకపోతే మీరు అంత కంగారు పడరు కదా మనోహరి గారు అని మిస్సమ్మ అడుగుతుంది. అంటే అది పిల్లలను ఒక్కదాన్ని ఎప్పుడూ చూసుకోలేదు కదా..? అందుకే.. పైగా మీరు సడెన్‌గా కాలింగ్ బెల్ కొట్టారు భయపడ్డాను అంతే తప్పా ఏం లేదు. అమర్ రేపు మధ్యాహ్నం వరకు మీరు రారేమో అని కంగారు పడ్డాను అని చెప్పగానే.. కాంపిటీషన్‌లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది .అందుకే కాంపిటీషన్‌ను త్వరగా ఫినిష్ చేశారు అని చెప్పగానే సరే అమర్ నువ్వు వెళ్లి ఫ్రెష్ అవ్వు అంటుంది. అమర్ వెళ్లిపోతాడు.
మరోవైపు రణవీర్ ఇంట్లో కోపంగా ఉంటాడు. అక్కడకు మనోహరి వెళ్లి నువ్వు వేస్ట్ రణవీర్ నువ్వు ఎంత ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉంటావు తప్పితే సక్సెస్ అవ్వలేవు ఎందుకంటే ఆరు ఆత్మకు అన్ని శక్తులు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఇంట్లో నుంచి పోవడం లేదు. అసలు ఏం చేస్తే దాని పీడ వదిలిపోతుందో అసలు అర్తం కావడం లేదు అంటుంది మనోహరి. దీంతో రణవీర్ కోపంగా ఈ సారి ఘోరాలు, అఘోరాలు కాదు. వాళ్లను మించిన శక్తిని పిలిపిస్తాను అంటాడు రణవీర్. ఎవరు వాళ్లు రణవీర్ అని మను అడుగుతుంది. దీంతో శంభా అని రణవీర్ చెప్పగానే.. శంభా ఎవరు అని మను అడుగుతుంది. శంభా గురించి రణవీర్ చెప్తాడు. అయినా మనోహరి అంతంత మాత్రమే నమ్ముతుంది. ఇంతలో శంభా ఎంటర్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం