OTT Movie : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు ఓటీటీని షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకూడా అలాటిందే. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే ఈ స్టోరీ, నలుగురు మహిళల జీవితాలచుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా సెన్సార్ బోర్డుతో కొన్ని రొమాంటిక్ సీన్స్ కారణంగా వివాదాలను ఎదుర్కొని, మొదట నిషేధించబడినప్పటికీ, ఫిల్మ్ సెర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (FCAT) ఆమోదంతో 2017 జులై 21న థియేటర్లలో విడుదలైంది. ఇది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, స్క్రీన్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్‌ప్లే, టోక్యో, ముంబై ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 8 అవార్డులను గెలుచుకుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా’ (Lipstick under my burkha) 2016లో విడుదలైన హిందీ బ్లాక్ కామెడీ సినిమా. దీనికి అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. ప్రకాష్ ఝా నిర్మించిన ఈ చిత్రం, ఏక్‌తా కపూర్ మరియు షోభా కపూర్ బ్యానర్‌లో రూపొందింది. ఈ సినిమాలో కొంకణ సేన్ శర్మ, రత్నా పాఠక్ షా , ఆహనా కుమ్రా, ప్లాబితా బోర్థాకుర్, విక్రాంత్ మాస్సీ, సుషాంత్ సింగ్, శశాంక్ అరోరా, జగత్ సింగ్ సోలంకి ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 6.8/10 రేటింగ్‌తో, రాటెన్ టొమాటోస్‌లో 83% స్కోర్‌తో, ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో ఇది అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
భోపాల్‌లోని ఒక చిన్న కాలనీలోని ఒక పాత ఇంట్లో శిరీన్, ఉషా, లీలా, రిహానా అనే నలుగురు మహిళలు నివసిస్తుంటారు. వీళ్ళు తమకోరికలను మనసులోనే దాచుకుని, తమ గుర్తింపు కోసం పోరాడుతుంటారు. వీళ్ళ కథలు “లిప్‌స్టిక్ వాలే సప్నే” అనే రొమాంటిక్ నవల ద్వారా చెప్పబడతాయి.
శిరీన్ ఆసియా (కొంకణ సేన్ శర్మ): 35 ఏళ్ల గృహిణి, ముగ్గురు పిల్లల తల్లి. ఆమె భర్త రహీమ్ (సుషాంత్ సింగ్) సౌదీ అరేబియాలో పనిచేస్తూ, ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటాడు. రహీమ్ ఆమెను కేవలం గృహిణిగా, పడక వస్తువుగా మాత్రమే చూస్తాడు. ఆమె కోరికలను, ఆశయాలను పట్టించుకోడు. శిరీన్ రహస్యంగా సేల్స్‌వుమన్‌గా పనిచేస్తూ, ఆర్థికంగా తనకాళ్లమీద నిలబడాలని కలలు కంటుంది. ఆమె తాను పనిచేసే చోట ఒక వ్యక్తిని ఇష్టపడుతూ, తన జీవితంలో సంతోషం కోసం ప్రయత్నిస్తుంటుంది.
ఉషా/బువాజీ (రత్నా పాఠక్ షా): ఈమె కాలనీలోని ఇంటి యజమాని అయినటువంటి 55 ఏళ్ల వితంతువు. అందరిచేత “బువాజీ”గా గౌరవం పొందుతుంది. బయట సాంప్రదాయకంగా కనిపిస్తూ, రహస్యంగా ఎరోటిక్ నవలలు చదువుతూ ఉంటుంది. ఉషా ఒక స్విమ్మింగ్ కోచ్ జాస్పాల్ (జగత్ సింగ్ సోలంకి)తో ఫోన్‌లో రొమాంటిక్ సంభాషణలు చేస్తూ, తన యవ్వన కలలను తిరిగి పొందాలని కోరుకుంటుంది. ఆమె ఈ సంబంధాన్ని కొనసాగించేందుకు ధైర్యం చేస్తుంది. కానీ సమాజం ఆమె వయసును, ఆమె వితంతు స్థితిని తప్పుపడుతూఆ మెను అవమానిస్తుంది.
లీలా (ఆహనా కుమ్రా): 29 ఏళ్ల బ్యూటీషియన్, ఆమె తల్లి ఆర్తి (సుష్మితా ముఖర్జీ) నడిపే చిన్న బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుంది. లీలా తన ప్రేమికుడు అర్షద్ (విక్రాంత్ మాస్సీ) అనే ఒక ఫోటోగ్రాఫర్‌తో రహస్యంగా సంబంధం పెట్టుకుని ఉంటుంది. అతనితో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటుంది. కానీ ఆమె తల్లి ఆర్థిక ఇబ్బందుల కారణంగా లీలాను ఒక సంపన్న వ్యక్తి (వైభవ్ తత్వవాది)తో వివాహం చేయాలని ఒత్తిడి చేస్తుంది. లీలా తన ప్రేమ, స్వేచ్ఛ కోసం ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆమె జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది.
Read Also : 12 ఏళ్ల అమ్మాయి ప్రెగ్నెంట్… హాకీ ఆడడానికి వెళ్లి… ఈ డైరెక్టర్ గట్స్‌కు దండం పెట్టాలి సామీ
రిహానా అబిదీ (ప్లాబితా బోర్థాకుర్): ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన 18 ఏళ్ల రిహానా అనే కాలేజీ విద్యార్థినిగా ఉంటుంది. ఆమె బయట బుర్కా వేసుకుంటూ, లోపల జీన్స్, లిప్‌స్టిక్, సంగీతం పట్ల మక్కువ పెంచుకుంటుంది. ఆమె మైలీ సైరస్‌ను ఆరాధిస్తూ, ఒక రాక్ బ్యాండ్‌లో సింగర్‌గా మారాలని కలలు కంటుంది. ఆమె తన క్రష్, డాక్ (శశాంక్ అరోరా) అనే ఒక డ్రమ్మర్‌తో కలిసి సమయం గడుపుతూ, రహస్యంగా మాల్‌లలో జీన్స్ దొంగిలించడం, పార్టీలకు వెళ్లడం వంటి రిబెలియస్ పనులు చేస్తుంది. కానీ ఆమె కుటుంబ పరిస్థితులు ఆమె జీవితన్ని తలకిందులు చేస్తాయి.
ఈ నలుగురు మహిళల కథలు ఒకే ఇంటిలో, ఒకే కాలనీలో అల్లుకుని నడుస్తుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో, ఈ నలుగురు మహిళలు ఒకచోట చేరి నవల చదవడం ద్వారా తమ స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. ఈ సన్నివేశం వారి పోరాటాన్ని, సమాజంలో అణచివేతలను ఎదిరించే ధైర్యాన్ని హైలైట్ చేస్తుంది.