Real Life Love Story: సినిమా ఇండస్ట్రీలో నటీనటులు పెళ్లి చేసుకోవడం చాలా కామన్. కానీ ఇద్దరు డైరెక్టర్స్ పెళ్లాడటం అంటే వింతే. అలా వైవాహిక బంధంతో ఒక్కటైన కెప్టెన్స్ ఇద్దరూ ఆ తరువాత విడిపోతే, విడిపోయిన వెంటనే ఒంటరితనం గురించి భార్య డైరెక్టర్ Lost in Translation (2003) అనే ఓ సినిమా తీస్తే… దానికి పదేళ్ళ తరువాత భర్త డైరెక్టర్ Her (2013) అనే మరో సినిమాతో సమాధానం చెబితే… అవునండీ బాబూ… ఇది రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. మరి ఈ ఎక్స్ వైఫ్ అండ్ హజ్బెండ్ తీసిన ఆ రెండు సినిమాలు ఏంటి ? ఆ సినిమాలకు రియల్ లైఫ్ లో వాళ్ళ కథలకు ఎలాంటి సంబంధం ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఇందులో ముందుగా వచ్చిన లాస్ట్ ఇన్ ట్రాన్స్‌లేషన్ గురించి మాట్లాడుకుందాం. కథ టోక్యోలో నడుస్తుంది. బాబ్ హారిస్ అనే ఫేడౌట్ అమెరికన్ యాక్టర్ ఒక విస్కీ కమర్షియల్ యాడ్ షూట్ కోసం జపాన్ వెళతాడు. అదే హోటల్ లో షార్లెట్ అనే అమ్మాయి ఉంటుంది. ఆమె భర్త సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ కావడం వల్ల ఎప్పుడూ బిజీగా ఉంటాడు. పైగా ఆమెను అస్సలు పట్టించుకోడు. కొత్త దేశం, తెలియని భాష, ఒంటరితనం… ఇద్దరూ ఇలాగే ఫీల్ అవుతారు. తరువాత వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమై, ఒకరి బాధలను మరొకరు పంచుకుంటూ ఓ బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఈ సినిమాలో డైలాగులు తక్కువ, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.
నెక్స్ట్ ‘హర్’ గురించి చెప్పుకోవాలి. కథ లాస్ ఏంజిల్స్‌లో భవిష్యత్ లో నడుస్తుంది. థియోడర్ ట్వోంబ్లీ అనే ఒక ఒంటరి రచయిత మన హీరో. తన భార్యతో విడాకులు తీసుకునే చివరి దశలో ఉంటాడు. తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్న అతను ‘సమంత’ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కొంటాడు. ఆ AI వాయిస్ అతనితో మాట్లాడే విధానం, అతని భావాలను అర్థం చేసుకునే తీరు నచ్చి, థియోడర్ ఒక మనిషిని ప్రేమించినట్లుగానే ఆ వర్చువల్ ఏఐ వాయిస్‌తో గాఢమైన ప్రేమలో పడతాడు.
ఈ రెండు సినిమాలు ఒకదానికొకటి కనెక్ట్ అయినట్టే అన్పిస్తాయి. ఎందుకంటే రెండు థీమ్స్ కూడా ఒక్కటే. అంతేకాదు దీనికి కారణం ఈ చిత్రాల దర్శకుల మధ్య ఉన్న నిజ జీవిత బంధం. లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ సినిమాను డైరెక్ట్ చేసింది సోఫియా కొప్పోలా. ‘హర్’ సినిమాను డైరెక్ట్ చేసింది స్పైక్ జోంజ్. వీరిద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలు. 1999లో ఈ జంట పెళ్లి కాగా, 2003లో విడాకులు తీసుకున్నారు. సోఫియా కొప్పోలా తన భర్త స్పైక్ జోంజ్‌ను పెళ్ళాడినప్పుడు, ఆ వివాహ జీవితంలో తాను అనుభవించిన ఒంటరితనాన్ని, భర్త ఎప్పుడూ పనిలో మునిగితేలడాన్ని బేస్ చేసుకుని తన కోణంలో ఈ ‘లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్’ అనే సినిమా తీసింది. దీనికి సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2013లో, అంటే విడాకుల తరువాత స్పైక్ జోంజ్ తప్పు తనదే అని ఒప్పుకుంటూ, క్షమాపణలు చెబుతున్నట్లుగా తన కోణంలో ‘హర్’ సినిమాను రూపొందించాడు. స్కార్లెట్ జాన్సన్ రెండు సినిమాల్లోనూ కనెక్ట్ అవడం ఒక అద్భుతమైన సినిమాటిక్ కనెక్షన్.
ఇక ‘లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్’ JioHotstar, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ‘హర్’ మూవీని ప్రైమ్ వీడియో, Netflixలో రెంట్ ఆప్షన్ ద్వారా చూడవచ్చు. రెండు సినిమాలకూ తెలుగు ఆడియో లేదు, కానీ తెలుగు సబ్‌టైటిల్స్ సహాయంతో చూడవచ్చు. ఈ రెండు సినిమాలు చూస్తుంటే ఒంటరితనం ఎంత బాధాకరమైనదో తెలుస్తుంది. హాలీవుడ్ చరిత్రలో అత్యంత స్పెషల్ ఈ రెండు సినిమాలు. వీటిని సినిమాలు అనడం కంటే డైరెక్టర్స్ అయిన ఇద్దరు భార్యాభర్తల లైఫ్ అని చెప్పవచ్చు.
Read Also: ఇక్కడ బ్రతకాలంటే పక్కనే ఉన్నోడిని చంపాల్సిందే… క్రేజీ కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్