E-Paper
Advertisement

ఇక్కడ బ్రతకాలంటే పక్కనే ఉన్నోడిని చంపాల్సిందే… క్రేజీ కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్

ఇక్కడ బ్రతకాలంటే పక్కనే ఉన్నోడిని చంపాల్సిందే… క్రేజీ కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్
Advertisement

Fantasy Adventure Movie: కలలో కూడా ఊహించని విధంగా ఆకాశంలో నుంచి డెమోన్స్ ఊడిపడితే… అది కూడా ఓ ఫాంటసీ బుక్ లో జరిగినట్టుగా జరిగితే… ఆ బుక్ ను చదివిన ఒక్క వ్యక్తికి మాత్రమే ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలిసి ఉంటే… ఇలాంటి క్రేజీ స్టోరీతో రూపొందిన మూవీనే ‘ఆమ్నిసైంట్ రీడర్: ది ప్రాఫెసీ’ (Omniscient Reader: The Prophecy). 2025లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ కిమ్ డోక్-జా అనే ఆఫీస్ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. అతనికి ‘Three Ways to Survive the Apocalypse’ అనే ఒక ఫాంటసీ వెబ్ నోవెల్ చదవడం అంటే పిచ్చి. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఆ నవలకు అతనొక్కడే ఏకైక రీడర్. అంతేకాదు చివరి వరకు చదివిన ఏకైక వ్యక్తి కూడా అతనే. ఆ నవలలో రాసిన ప్రతి ఛాలెంజ్, ప్రమాదం, వినాశనం డోక్-జా మనసులో అలాగే ఉండిపోతాయి. ఒకరోజు డోక్-జా ఆ నవల చివరి చాప్టర్‌ ను పూర్తి చేయగానే, అతను ప్రయాణిస్తున్న మెట్రో రైలులో వింత సంఘటనలు జరుగుతాయి.

Advertisement

నవలలో ఉన్నట్లే ఆకాశంలో ‘డోక్కేబి’ అనే వింత జీవులు ప్రత్యక్షమై, మానవ ప్రపంచం అంతం కాబోతోందని ప్రకటిస్తాయి. నవలలోని మొదటి ఛాలెంజ్ “బ్రతకాలి అంటే మీ పక్కన ఉన్న ఏదైనా ఒక జీవిని చంపాలి” అని షరతును విధిస్తాయి. రైలులో ఉన్న ప్రయాణీకులంతా భయంతో గందరగోళంలో పడతారు. డోక్-జా తనకున్న ఆ “ముందస్తు జ్ఞానం” ఆధారంగా తన సహోద్యోగి అయిన సాంగ్ హ్యున్-వూతో పాటు ఇతరులను కాపాడుకుంటూ మొదటి ఛాలెంజ్ ను దాటుతాడు. కానీ ఇది ప్రారంభం మాత్రమే.

మొత్తం 99 ఛాలెంజెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. నవలలోని అసలు ముగింపులో ప్రపంచం నాశనమై కేవలం ఒక్కడే మిగులుతాడు. కానీ, డోక్-జా ఆ విషాదకరమైన ముగింపును మార్చాలని అనుకుంటాడు. ఈ ప్రయాణంలో డోక్-జాకు ఆ నవలలోని అసలైన క్రూరమైన, అత్యంత శక్తివంతమైన హీరో ‘యూ జుంగ్-హ్యుక్’ ఎదురవుతాడు. జుంగ్-హ్యుక్ చనిపోయినా మళ్లీ బ్రతికే శక్తులు ఉన్న యోధుడు. కానీ అతను నవలలోని క్లిష్టమైన పరిస్థితుల వల్ల చాలా క్రూరంగా మారిపోయి ఉంటాడు. డోక్-జా తన భవిష్యత్తు జ్ఞానంతో జుంగ్-హ్యుక్‌తో చేతులు కలిపి, తన స్నేహితులందరినీ బ్రతికించుకుంటూ ఒక సరికొత్త హ్యాపీ ఎండింగ్ కోసం చేసే భీకర పోరాటమే ఈ సినిమా కథ. మరి హీరో అనుకున్నట్టుగానే ఎండింగ్ ను మార్చగలిగాడా ? విలన్ ను ఎలా ఓడించాడు ? క్లైమాక్స్ కథ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

యాక్షన్, ఫాంటసీ కలిసి ఉన్న ఎపిక్ అడ్వెంచర్ ఈ సినిమా. ఈ చిత్రం చూస్తుంటే మన జీవితం ఒక నవలలా ఉంటే ఎలా ఉంటుందో, దాన్ని మార్చుకోవాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో అలాగే ఉంటుంది. భవిష్యత్తు తెలిసిన ఒక సాధారణ వ్యక్తి ఎలా ప్రపంచాన్ని మార్చగలడో చూపించే ఒక ఎపిక్ గాథ. వెబ్‌టూన్ ఆధారంగా రూపొందిన ఈ హై-బడ్జెట్ సౌత్ కొరియన్ యాక్షన్ ఫాంటసీ చిత్రంలో లీ మిన్-హో, అన్ హ్యో-సియోప్, బ్లాక్‌పింక్ జిసూ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Video, Apple TVలలో కొరియన్, ఇంగ్లీష్ ఆడియోలతో అందుబాటులో ఉంది. తెలుగులో స్ట్రీమింగ్ కావట్లేదు.

Read Also: బ్రతికొచ్చే శవాలు, చేతబడులు… ‘ట్రైన్ టు బుసాన్’ డైరెక్టర్ నుంచి వచ్చిన మరో ఎపిక్ హర్రర్ థ్రిల్లర్

Related News

అవుటర్ స్పేస్ లో అనాథలు… ఒక్కో యాక్షన్ సీక్వెన్స్ కు గూస్ బంప్స్

చంద్రుడిని పేల్చేసే బోన్ చిల్లింగ్ సై-ఫై థ్రిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్ అంతే

కాంక్రీట్ గోడలో యువతి శవం… పుట్టిన ప్రతీ ఆడపిల్లను క్రూరంగా చంపే ముఠా

అలాంటి అమ్మాయిల రూపంలో లక్ష్మీదేవి… మోస్ట్ అండర్రేటెడ్ మాస్టర్ పీస్

సమంత ‘మా ఇంటి బంగారం’ అఫీషియల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

ప్రేమించిన వాడు పోయాడని కొడుకుతో… ఒంటరిగా చూడాల్సిన మూవీ

బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తే సోకే వైరస్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్

Big Stories

Advertisement
×