OTT Movie : పరువు హత్యల నేపథ్యంలో రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ మూవీ, ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో, హీరోయిన్లతో పాటు దర్శకుడు కూడా ఈ మూవీకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ తో ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉంటుంది. చిన్న సినిమానే అయినా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ లవ్ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? వివరాల్లోకి వెళితే…
ఆహా (aha)లో
ఈ లవ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘లవ్ రెడ్డి‘ (Love Reddy). ఈ మూవీలో అంజన్ రామచంద్ర, శ్రావణి హీరో, హీరోయిన్లు గా నటించారు. జ్యోతి మదన్, యన్.టీ రామస్వామి కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని రిలీజ్ చేయగా, ప్రిన్స్ హెన్ని దర్శకత్వం వహించారు. రాయలసీమ ప్రాంతంలో సాగిపోయే ఈ రొమాంటిక్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో 2025 జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఒకసారి ఈ మూవీ టీం జరిపిన ఫంక్షన్ లో విలన్ క్యారెక్టర్ గా నటించిన యన్.టీ రామస్వామిని, ఒక అభిమాని కొట్టడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అప్పుడు ఆ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
స్టోరీలోకి వెళితే
రాయలసీమలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండే ఒక పల్లెటూరులో నారాయణరెడ్డి నివాసం ఉంటాడు. ఇతనికి వయసు ముప్పై సంవత్సరాలు దాటిపోతూ ఉండటంతో, తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తారు. అయితే ఇతనికి ఎన్ని సంబంధాలు చూసినా దేనికి ఓకే చెప్పడు. ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు నారాయణరెడ్డి. ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ సరదాగా జీవితం గడుపుతాడు. ఈ క్రమంలో దివ్య అనే అమ్మాయిని చూసి, మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు నారాయణరెడ్డి. ఇన్ని రోజులు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిన నారాయణరెడ్డి దివ్యని చూసిన తరువాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దివ్యకి ఇదివరకే వేరొకరితో నిశ్చితార్థం జరిగి ఉంటుంది. దివ్య నారాయణరెడ్డి ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి భయపడుతుంది. మరోవైపు దివ్య తండ్రికి ఈ విషయం తెలుస్తుంది. పరువుకోసం బ్రతికే తండ్రి దివ్యని అతనితో కలవనీకుండా చేస్తాడు. ఈ క్రమంలో తండ్రిని ఎదుర్కొని, దివ్యను పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు నారాయణరెడ్డి. చివరికి నారాయణరెడ్డి తన ప్రేమను దక్కించుకున్నాడా? దివ్యకి జరిగిన నిశ్చితార్థం ఏమవుతుంది? దివ్య తండ్రి వీళ్ళిద్దరి ప్రేమకు ఎలా అడ్డుపడతాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ రెడ్డి’ (Love Reddy) మూవీని మిస్ కాకుండా చూడండి.