E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయి ఒంట్లో డ్రగ్… ప్రియుడి కోసం సాహసం చేస్తే ఊహించని ట్విస్ట్… మైండ్ బెండ్ చేసే సై-ఫై మూవీ

OTT Movie : అమ్మాయి ఒంట్లో డ్రగ్… ప్రియుడి కోసం సాహసం చేస్తే ఊహించని ట్విస్ట్… మైండ్ బెండ్ చేసే సై-ఫై మూవీ
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా దుమ్ము దులిపేసింది. థియేటర్లలో అత్యధిక వసూళ్లు సాధించి, ఓటీటీలో కూడా సత్తా చాటింది. ఈ మూవీ స్టోరీ లూసి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక డ్రగ్ ప్రభావం వల్ల ఈ అమ్మాయికి అంతులేని పవర్స్ వస్తాయి. ఆ తరువాత స్టోరీ ఊహించని రీతిలో టర్న్ తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘లూసీ’ (Lucy). 2014 లో వచ్చిన ఈ సినిమాకు లూక్ బెస్సన్ దర్శకత్వం వహించాడు. అతని భార్య వర్జీనీ బెస్సన్-సిల్లా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో స్కార్లెట్ జాన్సన్, మోర్గాన్ ఫ్రీమాన్, చోయ్ మిన్-సిక్, అమ్ర్ వేక్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్కార్లెట్ జోహాన్సన్ టైటిల్ రోల్‌లో నటించారు. ఈ మూవీ 2014 జూలై 25 న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

లూసీ అనే అమెరికన్ విద్యార్థిని, తైవాన్‌ లో ఒక సమస్యలో చిక్కుకుంటుంది. ఆమె తన ప్రియుడి ఒత్తిడితో ఒక మాఫియా గ్యాంగ్‌ కు డ్రగ్స్ డెలివరీ చేయడానికి వెళ్తుంది. ఆమె శరీరంలో CPH4 అనే సింథటిక్ డ్రగ్ ప్యాకెట్‌ ను దాచి రవాణా చేస్తారు. కానీ ఒక చోట ఆ ప్యాకెట్ లీక్ అవడంతో, ఆ డ్రగ్ ఆమె శరీరంలోకి వ్యాపిస్తుంది. ఆమె శరీరంలో అనుకోని మార్పులు వస్తాయి. ఈ డ్రగ్ ఆమె మెదడు సామర్థ్యాన్ని అసాధారణంగా పెంచుతుంది.

మరోవైపు ఆ మాఫియా గ్యాంగ్‌ డ్రగ్స్ కోసం ఆమెను బంధిస్తారు. ఆమెను చాలా టార్చర్ చేస్తారు. ఈ డ్రగ్ ప్రభావంతో లూసీకి సూపర్‌ హ్యూమన్ శక్తులు వస్తాయి. లూసీ తన మెదడు సామర్థ్యాన్ని క్రమంగా 100% ఉపయోగించే స్థాయికి చేరుకుంటుంది. ఆమె ఈ శక్తులను ఉపయోగించి మాఫియా గ్యాంగ్‌ ను ఎదుర్కుంటుంది. ఆ గ్యాంగ్ ను నామరూపల్లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది.

Read Also : మగాడి కష్టాలు కళ్ళకు కట్టినట్టు చూపించిన మూవీ… పడి పడి నవ్విస్తూనే, ఏడిపించారు భయ్యా

ప్రొఫెసర్ నార్మన్ సహాయంతో, లూసీ తన జ్ఞానాన్ని మానవాళికి అందించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె శరీరం క్రమంగా రూపం కోల్పోతుంది. ఆమె భౌతిక రూపాన్ని కోల్పోయి, డిజిటల్ రూపంలో మారిపోతుంది. చివరికి లూసీ మాఫియా గ్యాంగ్‌ ను ఎదుర్కొంటుందా ?  తన జ్ఞానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది ? ఆమెకు ఇక అసలు రూపం రాదా ? అనే విషయాలను, ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×