India Pakistan War: భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది. పాక్ పాలకులకు టన్నుల కొద్ది భయం పట్టుకుంది. అయితే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద శిబరాలపై దాడులు జరిగిన తర్వాత పరిణామాల గురించి భారత భద్రతా బలగాలు మరొక సుదీర్ఘ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందు మరికొన్ని వివరాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేశాం
భారత్ త్రివిధ దళాలు పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ఇదివరకే తాము స్పష్టం చేశామని అధికారులు చెప్పారు. మతపరమైన ప్రదేశాలను పాక్ దుర్వినియోగం చేస్తోందని అన్నారు. పూంఛ్ లో గురుద్వారను టార్గెట్ చేసి దాడులు చేశారని.. దేశంలో 15 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నం చేసిందని వివరించారు. సరిహద్దులో 16 మంది భారత్ పౌరులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. ‘పాక్ సైనిక స్థావరాలను మేం టార్గెట్ చేయలేదు. కానీ పాక్ మాత్రం మిసైళ్లతో దాడికి తెగబడింది. పాక్ దుశ్చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టాం. పాక్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను టార్గెట్ చేశాం. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేశాం’ అని సోఫియా ఖురేషి చెప్పుకొచ్చారు.
Also Read: India Pak War: ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ.. పాక్‌కు భారత్ మరో స్ట్రాంగ్ వార్నింగ్
గురుద్వారాలపై పాక్ దాడి
‘భారత్ లోని గురుద్వారాలపై పాక్ దాడి చేసింది. పాక్ దాడిలో ముగ్గురు సిక్కులు చనిపోయారు. తప్పుడు సమాచారంతో పాక్ మతం రంగు పూస్తోంది. పాక్ సైన్యాధ్యక్షుడి మాటలు చూస్తుంటే.. పహాల్గామ్ దాడులకు సంబంధం ఉంది. పహాల్గామ్ దాడులతో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. పహల్గామ్ దాడుల తర్వాతే ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఎక్కడా భారత్ పాక్ మిలటరీ స్థావరాలపై దాడులు చేయలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలనే మాత్రమే టార్గెట్ చేశాం’ అని అధికారులు తెలిపారు.
Also Read: India Vs Pakistan : పాక్‌తో ఫైట్.. చైనాను చిత్తు చేసిన భారత్.. ఇదిగో ప్రూఫ్స్
ప్రభుత్వం లాంఛనాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలు
‘లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్. పహల్గామ్ దాడులకు పాల్పడింది తామేనని.. టీఆర్ఎఫ్ రెండు సార్లు ప్రకటించింది. కౌన్సిల్ లో టీఆర్ఎఫ్ రద్దును పాక్ వ్యతిరేకించింది. లాడెన్ ఎక్కడ దొరికాడో గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సమాజాన్ని పాక్ తప్పు దారి పట్టిస్తోంది. అనేక మంది టెర్రరిస్టులకు పాక్ ఆశ్రయంగా మారింది. తమకు సంబంధం లేదని పాక్ చెబుతోంది. పలు దాడుల్లో పాక్ ప్రమేయం ఉందని రుజువైంది. ప్రభుత్వ లాంఛనాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియల వీడియోలు చూస్తే ప్రపంచానికి అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు.
Also Read: BIG BREAKING: ఆపరేషన్ సిందూర్.. ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు, అవి అపేయండి