OTT Movie : భయంకర సన్నివేశాలు, ఆకట్టుకునే స్టోరీతో ఒక సూపర్‌నాచురల్ హారర్ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇందులో జోల పాట పాడితే పిల్లలకు దెయ్యం ఆవహిస్తుంది. ఈ దెయ్యాలు ఇందులో చేసే రచ్చ మామూలుగా అయితే ఉండదు. మీకు కూడా వణికించే థ్రిల్ కావాలనుకుంటే, ఈ సూపర్‌నాచురల్ హారర్ సినిమాను చుడండి. దీని పేరు ? ఏ ఓటీటీ లో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీ ఉందంటే
‘Lullaby’ ఒక అమెరికన్-కెనడియన్ సూపర్‌నాచురల్ హారర్ చిత్రం. ఇది జాన్ ఆర్. లియోనెట్టి దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ఊనా చాప్లిన్, రామన్ రోడ్రిగెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2022 డిసెంబర్ 16 థియేటర్లలో విడుదలైంది. IMDbలో ఈసినిమాకి 4.9/10 రేటింగ్ ఉంది. 1 గంట 29 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
రాచెల్, జాన్ అనే జంట, తమ బిడ్డ ఎలీతో కొత్త అపార్ట్‌మెంట్‌కు వెళతారు. రాచెల్ తల్లి, ఆమె సోదరి వివియన్ నుండి కొన్ని పాత బేబీ వస్తువులను పంపిస్తుంది, వివియన్ తన కొడుకు జాకరీ, భర్తను ఒక దుర్ఘటనలో కోల్పోయి, ప్రస్తుతం మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటుంది. అయితే ఈ వస్తువులలో ఒక పురాతన హీబ్రూ పుస్తకం ఉంటుంది. రాచెల్ ఎలీని ఏడుపు ఆపడం కోసం ఈ పుస్తకాన్ని చూసి పాడుతుంది. ఇది మొదట బిడ్డను నిద్రపుచ్చినట్లు అనిపిస్తుంది, కానీ త్వరలో భయంకర సంఘటనలు ప్రారంభమవుతాయి. ఆతరువాత రాచెల్, జాన్ కు కలలో రెండు తలలున్న పిల్లల రూపాలు వస్తుంటాయి.
Read Also : ఈ ఊర్లో ఒంటరితనం నేరం… సింగిల్స్ ను శిక్షించే వింత హోటల్… మొత్తం ఆ సీన్లే