OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. అందులోనూ డిఫరెంట్ స్టోరీలంటే ఇక చెప్పేపనిలేకుండా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సై-ఫై సినిమా డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో జరుగుతుంది. ఇక్కడ ఒంటరి వ్యక్తులు 45 రోజులలో భాగస్వామిని వెతుక్కోవాలి. లేకపోతే వాళ్ళను జంతువులుగా మార్చేస్తుంటారు. ఇక ఈ సినిమాని చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీని చూసి, తరువాత చూసేయండి. ఇది ఏ ఓటీటీలో ఉంది. దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘The Lobster’ ఒక బ్లాక్ కామెడీ సై-ఫై సినిమా. గ్రీక్ దర్శకుడు యోర్గోస్ లాంథిమోస్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో కోలిన్ ఫారెల్, రాచెల్ వైజ్, జెస్సికా బార్డెన్, ఒలివియా కోల్మన్, జాన్ సి. రీల్లీ నటించారు. 2015 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ ప్రైజ్ గెలుచుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1 గంట 58 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 7.1/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, అపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ భవిష్యత్తులో జరుగుతుంది. ‘ది సిటీ’ అనే ప్రదేశంలో ఒంటరిగా ఉన్న వ్యక్తులు చట్టం ప్రకారం ఒక పెద్ద హోటల్ కు రావాల్సి ఉంటుంది. అక్కడ వీళ్ళు 45 రోజులలో తన భాగస్వామిని వెతుక్కోవాలి. అలా చేయలేకపోతే వాళ్ళను జంతులక్షణాలతో లాబ్‌స్టర్‌గా మార్చి అడవుల్లో వదిలేస్తారు. ఈ నేపథ్యంలో డేవిడ్ అనే వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అతను తన భార్యతో 11 సంవత్సరాలు కలసి ఉంటాడు. ఆ తరువాత వేరే వ్యక్తి కోసం అతన్ని విడిచి పెడుతుంది. ఇప్పుడు డేవిడ్ ఒంటరి అవ్వడంతో ఈ మాన్షన్ కు చేరుకుంటాడు. ఒకవేళ ఇప్పుడు అతను మరో భాగస్వామిని సంపాదించుకోలేకపొతే, అతను లాబ్‌స్టర్‌గా మారిపోవాల్సి వస్తుంది.
Read Also : సెక్యూరిటీతో డాక్టర్ యవ్వారం… దెయ్యం ఎంట్రీతో ట్విస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ థ్రిల్లర్