OTT Movie : బాలీవుడ్ నుచి వచ్చే రొమాంటిక్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువే. ఈ సినిమాలను కళ్ళార్పకండా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఈయనగారి రొమాంటిక్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ బాలీవుడ్ లో స్టార్ కావాలనే కళలు కన్న నవాజుద్దీన్ చివరికి అమ్మాయిల బ్రోకర్ గా మారుతాడు. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘Tiku Weds Sheru’ ఒక హిందీ రొమాంటిక్ మూవీ. సాయి కబీర్ దర్శకత్వంలో, కంగనా రనౌత్ నిర్మాణంలో, మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్ కింద తెరకెక్కింది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ, అవనీత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2023 జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 52 నిమిషాల నిడివితో, హిందీ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
షిరాజ్ ఖాన్, అలియాస్ షేరు (నవాజుద్దీన్ సిద్దిఖీ) ముంబైలో ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ, బాలీవుడ్‌లో పెద్ద హీరో అవ్వాలని కలలు కంటాడు. అతను కవితలు చెప్పే, ఫిల్మీ డైలాగ్‌లతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ జీవనోపాధి కోసం రాత్రిళ్లు పింప్‌గా (వ్యభిచార దళారీగా) పనిచేస్తుంటాడు. అతను తన స్వంత సినిమా ప్రాజెక్ట్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ డబ్బు పెట్టి నష్టపోతాడు. దీనివల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు. అతని సోదరుడి సలహాతో, షేరు భోపాల్‌లో తస్లీమ్ అలియాస్ టీకూ (అవనీత్ కౌర్) అనే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వెళతాడు. టీకూ ఒక చిన్న పట్టణంలో ఉంటూ, బాలీవుడ్ స్టార్ కావాలని కలలు కంటుంది. తన సంప్రదాయ కుటుంబం నుండి బయటపడటానికి షేరుతో వివాహానికి అంగీకరిస్తుంది. అయితే ఆమె రహస్యంగా తన ప్రియుడు బిన్నీ (రాహౌల్)తో ముంబైలో కలవాలని ప్లాన్ చేస్తుంది.
Read Also : రహస్య నిధి కోసం వేట… పనీపాటా మానేసి తింగరోళ్ల సాహసం… కితకితలు పెట్టే మలయాళ కామెడీ డ్రామా