Jabardast Rakesh : ఆకలితో ఉన్నప్పుడు కొంతమంది పెట్టిన నాలుగు మెతుకులే జీవితాంతం గుర్తుండేలా చేస్తాయి. వాళ్లకి జీవితాంతం కృతజ్ఞత చూపించేవాళ్లు కొందరైతే. అన్నం పెట్టిన వాళ్లకి సున్నం పెట్టే వాళ్లు మరికొందరు. ఇలాంటివి బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. లైఫ్ ని ఇచ్చిన కొంతమందికి లైఫ్ లేకుండా చేశారని చాలామంది ఈ షో ద్వారా తన ఆవేదనను బయటపెట్టారు. నమ్మకంగా ఉంటారని తీసుకొస్తే వెన్నుపోటు పొడిచారు అంటూ మరికొందరు నిజాలను బయటపెడుతున్నారు. ఇది పక్కనపెడితే జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన రాకింగ్ రాకేష్, ఆర్పీ మధ్య మాటల యుద్ధం మొదలైందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. తాజాగా రాకేష్ ఆర్పీ పై ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
డబ్బుల కోసమే వాడు ఇదంతా చేస్తున్నాడు..
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రోజా గురించి ఆర్పీ ఎందుకు అలా కామెంట్స్ చేస్తున్నాడని అడిగారు యాంకర్..ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా రావడంతో.. కీలక వ్యాఖ్యలు చేశారు రాకేష్.. ఆర్పీ లాగా నేను డబ్బుల కోసం మాటలు మార్చను. చేసిన సాయాన్ని మర్చిపోను అని రాకేష్ అన్నారు. వాడు మన వాడు అని నా మనసులో ఉంటే.. నేనే వెళ్లి వాడి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడతా. వద్దురా.. తప్పురా అని చెప్పేవాడ్ని. కానీ వాడికి అదే పని అయినప్పుడు మనం ఏం అనగలం. వాడు డబ్బు కోసం అలా చేస్తున్నాడో లేదంటే.. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల అలాంటి మాటలు వస్తున్నాయో తెలియదు. కానీ వాడేమి అన్నా పట్టించుకోకపోవడమే మంచిది అని రాకేష్ అన్నారు.
నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు..
ఈ ఇంటర్వ్యూలో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా, రోజమ్మ ఫ్యానా అని అడగ్గా.. దానికి సమాధానం చెప్పారు రాకేష్. నేను పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్‌ని అని యాంకర్ అంటే.. ‘మీరు ఫ్యాన్ ఏమో నేను కాదు.. అయినా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ఆయన ఎందుకు స్పందించడం లేదో మాకు తెలియదు… ఏమో అది మీలాంటి జర్నలిస్ట్‌లే అడిగాలి అంటూ కౌంటర్ వేశారు రాకింగ్ రాకేష్..
Also Read : ముసలోడే కానీ.. మహానుభావుడు సామి.. అస్సలు నమ్మలేరు..
రోజమ్మ జోలికి వస్తే ఊరుకోను..
జబర్దస్త్ లో ఉన్న చాలా మందిని రోజమ్మ ఆదరించి అన్నం పెట్టింది. మమ్మల్ని ఆవిడ జీరోగా ఉన్నప్పటి నుంచి చూశారు. తినడానికి తిండి లేనప్పటి నుంచి చూశారు. అప్పటికే ఆమె పెద్ద స్టార్ హీరోయిన్. ఆమెను దూరం నుంచి చూసి.. మనం ఈవిడ ముందే స్కిట్ చేస్తున్నాం అని గర్వంగా ఫీల్ అయ్యేవాళ్లం.. ఇల్లు కొనిచ్చింది. పెళ్లి చేసింది. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది ఆమె.. నేనే కాదు చాలా మందికి ఆమె ఒక జీవితం అందించింది. నాకే సాయం చేస్తుందని అనుకుంటారు కానీ.. సమస్య వచ్చింది ఆమెకి చెప్తే చాలు ఎవర్నైనా ఆవిడ అలాగే ఆదుకుంటారు. సమస్య వచ్చిందంటే.. నేనున్నా చూసుకుంటా అని అంటారు. అలాంటి రోజా గారి వల్ల లాభం పొంది.. ఇప్పుడే ఆవిడనే అంటున్నారు. ఆమె మాకు మంచి చేసింది. వెస్ట్ గాళ్ళు ఏమన్నా పట్టించుకోము అని రాకేష్ ఆర్పీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.